సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 2 మార్చి 2021 (10:19 IST)

441వ రోజుకు రాజధాని రైతుల నిరసనలు

రాజధాని అమరావతి కోసం రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 441వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు, దొండపాడు, బేతపూడి, ఉండవల్లి తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు  కొనసాగుతున్నాయి.

రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు. కరోనా సూచనలు పాటిస్తూ అమరావతి ఉద్యమం సాగుతోంది.

మరోవైపు విశాఖ ఉక్కు సాధిస్తామని అమరావతి రైతులు తెలిపారు. ఇందులో భాగంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ అమరావతి రైతులు, మహిళలు రిలే దీక్షలు చేస్తున్నారు.