బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 అక్టోబరు 2024 (13:37 IST)

తిరుపతి: రాజ్‌పార్క్‌ హోటల్‌తో పాటు ఇతర ప్రాంతాలకు బాంబు బెదిరింపులు

tirupati railway station
తిరుపతిలోని రాజ్‌పార్క్‌ హోటల్‌తో పాటు ఇతర ప్రాంతాలకు వరుస బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. 
 
రాజ్ పార్క్ హోటల్‌తో పాటు, లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేట్ హోటళ్లు, రామానుజ జంక్షన్‌లోని ఒక హోటల్‌తో సహా పలు ఇతర హోటళ్లకు గురువారం ఇమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. 
 
డీఎస్పీ వెంకట నారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రతి హోటల్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.