సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 ఏప్రియల్ 2022 (14:32 IST)

తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో దారుణం: వారం రోజుల్లోనే తొమ్మిది మంది మృతి

తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో పసికందులు ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం వారం రోజుల్లోనే తొమ్మిది మంది శిశువులు మరణించారు. దీంతొ ఈ ప్రసూతి ఆస్పత్రికి రావటానికి భయపడిపోతున్న పరిస్థితి నెలకొంది.
 
ఒక్కరు, ఇద్దరు కాదు.. తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో ఏకంగా 14మంది పసిబిడ్డలు మృతి చెందారు. వారం రోజుల్లో 9మంది మృత్యువాత పడటంపై కుటుంబ సంక్షేమ శాఖ సీరియస్‌ అయింది. ప్రస్తుతం శిశు మరణాలపై విచారణ జరుపుతోంది.
 
మరోవైపు రుయా చిన్నపిల్లల ఆస్పత్రిలోనూ శిశు మరణాలు కొనసాగుతుండటంపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దీనిపై కుటుంబ సంక్షేమ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.