బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (10:24 IST)

ఏప్రిల్ 17 తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు

railway bridge
ప్రయాణీకుల సౌకర్యార్థం ఏప్రిల్  17న తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలును నడుపనున్నారు. ఈ నెల 17న తిరుపతి నుంచి ప్రత్యేక రైలు (02763) 17.00 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌‌కు 18వ తేదీన ఉదయం 5.45 గంటలకు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు  ఓ ప్రకటనలో తెలిపారు. 
 
ఈ రైలు రేణిగుంట, శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు జంక్షన్‌, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, దోర్నకల్‌, మహబూబాబాద్‌, వరంగల్‌, కాజీపేట జంక్షన్‌, జనగామ మీదుగా సికింద్రాబాద్‌ చేరుకుంటుందని వివరించారు.