ఏపీలో పలు నగరపాలక, పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఫలితాల్లో 1206 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. కుప్పం పురపాలక ఓట్ల లెక్కింపుపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. అక్కడ మొత్తం 25 వార్డులకు గానూ 24 వార్డుల ఓట్ల లెక్కింపు జరుతుండగా ఒక వార్డు ఏకగ్రీవమైంది. కుప్పంలోని ఎంఎఫ్‌సీ ఒకేషనల్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అలాగే నెల్లూరు కార్పొరేషన్, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఓట్ల లెక్కింపు నెల్లూరు డీకేడబ్ల్యూ కాలేజీలో జరుగుతోంది. అటు కమలాపురం నగర పంచాయతీ, రాజంపేట పురపాలిక ఓట్ల లెక్కింపు మొదలైంది.
కొండపల్లి మునిసిపాలిటీలో వైసీపీకి, టీడీపీకి మధ్య పోటాపోటీగా ఉంది. అయితే, మొగ్గు మాత్రం వైసీపీ వైపే ఉంది. 9 చోట్ల వైసీపీ, 6 చోట్ల టీడీపీ గెలుపొందాయి. కొండపల్లి మునిసిపాలిటీలో 1-16వార్డుల్లో గెలుపొందిన అభ్యర్థుల వివరాలివి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ - 9
తెలుగుదేశం పార్టీ - 6
స్వతంత్ర అభ్యర్థి - 1
1) మండే చంద్రశేఖర్ - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
2) మోటూరి అరుణ - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
3) దామెర్ల శ్రీలక్ష్మి - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
4) బాడిశ అంజనా దేవి - తెలుగుదేశం పార్టీ
5 ) మొగిలి దయా సాగర్ - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
6) చుట్టుకుదురు వాసు - తెలుగుదేశం పార్టీ
7) కుమ్మరి నాగ సుధ - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
8) షీనా బేగం - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
9) కాటమరాజు దుర్గ భవాని - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
10) కరిమికొండ శ్రీ లక్ష్మి - స్వతంత్ర అభ్యర్థి
11 ) అడపా వెంకయ్య నాయుడు - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
12) కామినేని అనిల్ - తెలుగుదేశం పార్టీ
13) చనుమోలు నారాయణ - తెలుగుదేశం పార్టీ
14) నల్లమోతు లక్ష్మీ - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
15) ఉప్పుతల గోపాలరావు - తెలుగుదేశం పార్టీ
16) ధరణికోట విజయలక్ష్మీ - తెలుగుదేశం పార్టీ