సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 జులై 2024 (12:33 IST)

తిరుమలలో జాపాలి క్షేత్రంలో యువతిపై విరిగిపడ్డ చెట్టు కొమ్మ.. (Video)

Tree Branch
Tree Branch
తిరుమల కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలో ఆంజనేయస్వామి దర్శనం కోసం వెళ్తున్న ఓ యువతిపై చెట్టు కొమ్మ విరిగిపడింది. ఈ ఘటనలో ఆ యువతి తల, వెన్నెముకకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఇక దీనిపై ఇప్పటి వరకు టీటీడీ అధికారులు అధికారిక ప్రకటన చేయలేదు. అసలు గాయపడిన ఆ యువతి ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చారు అనే వివరాలు తెలియాల్సి వుంది. 
 
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. వీడియోలో యువతి నడుచుకుంటూ వెళుతుండగా ఒక్కసారిగా ఆమెపై కొమ్మ విరిగిపడింది. దీంతో ఆ యువతి అక్కడికక్కడే కుప్పకూలింది.