తిరుమలలో ఏనుగుల గుంపు హల్ చల్ -భయాందోళనలో భక్తులు
తిరుమలలో ఏనుగుల గుంపు హల్ చల్ చేశాయి. ఘాట్ రోడ్డులోని మెట్ల మార్గం గుండా స్వామి వారి దర్శనం కోసం వెళ్తున్న భక్తులకు చుక్కలు చూపించాయి. మొదటి ఘాట్‌రోడ్డులో శుక్రవారం సాయంత్రం ఏనుగుల గుంపు కన్పించింది.
ఏనుగుల గుంపు రోడ్డుకు దగ్గరగా వచ్చాయి. అంతేకాకుండా ఏడవ మైలు దగ్గర చెట్లను విరిచేస్తూ, పెద్దగా అరుస్తూ కనిపించాయి. ఏనుగుల గుంపును చూసి భక్తులు భయంతో దూరంగా పారిపోయారు. కొందరు వాహనదారులు తన వాహనాలను రోడ్డుపై నిలిపివేశారు.
దీని వల్ల దాదాపు రెండు కిలోమీటర్ల వరకు వాహనాలు ఆగిపోయాయి. వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ఘాట్ రోడ్డులో చాలాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఈ నేపథ్యంలో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురైనట్లు తెలుస్తోంది. ఇప్పటి దాక చిరుతలు, పాములతో భయపడిపోయిన భక్తులు, ఇప్పుడు ఏనుగులు కూడా ఘాట్‌ల దగ్గరకు రావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.