ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. లోక్ సభ ఎన్నికలు 2024
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 12 ఏప్రియల్ 2024 (20:19 IST)

మీరు చెక్ చేసుకోండి, నేను ఏనుగులు ఏం చేస్తున్నాయో చూస్తా: నీలగిరి భాజపా అభ్యర్థి మురుగన్

elephant
ఈసారి దక్షిణాదిలోనూ భాజపా పాగా వేయాలని చూస్తోంది. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో కీలక స్థానాల్లో విజయం సాధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. డిఎంకె నాయకుడు ఏ.రాజా పోటీ చేస్తున్న నీలగిరి నియోజకవర్గంలో భాజపా నుంచి ఎల్. మురుగున పోటీ చేస్తున్నారు. ఆయన ఎన్నికల పర్యటన చేస్తుండగా నీలగిరి రహదారిపై ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్ ఒక్కసారిగా ఆయన కాన్వాయ్‌ను నిలిపివేసింది.
 
కారులో ఏమున్నాయో చెక్ చేసేందుకు చూడాలనగానే మురుగన్ వెంటనే కిందికి దిగేశారు. ఆ తర్వాత రోడ్డు కల్వర్టు వద్ద నిలబడి అడవిలోకి అలా దృష్టి కేంద్రీకరించారు. ఆయనకు ఓ ఏనుగు మేత మేస్తూ కనబడింది. దాన్ని చూసి అక్కడి నుంచి రోడ్డుకి ఇటువైపు వచ్చి తేరిపారా చూసారు. ఇంతలో చెకింగ్ అయిపోయిందనగానే కారు ఎక్కి వెళ్లిపోయారు.