గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 మే 2024 (16:23 IST)

అడవి ఏనుగుల గుంపును వీడియో తీశాడు.. కాలుజారి పడి?

elephants
అడవి ఏనుగుల గుంపును వీడియోగా చిత్రీకరిస్తున్న జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు. నీటి స్థావరాన్ని దాటే క్రమంలో ఏనుగు చేసిన దాడిలో అతను ప్రాణాలు కోల్పోయాడు. కేరళ మాతృభూమి టీవీ న్యూస్ ఛానెల్‌లో పనిచేస్తున్న ఏవీ ముఖేష్ (34) బుధవారం పాలక్కాడ్‌లోని కొట్టెక్కాడ్ అటవీ ప్రాంతంలో కనిపించిన ఏనుగుల గుంపును చిత్రీకరించడానికి వెళ్లాడు.
 
ఏనుగులను షూట్ చేస్తుండగా ఎవి ముఖేష్ కాలుజారి కిందపడిపోయినట్లు సమాచారం. ఇది చూసి రెచ్చిపోయిన ఏనుగు అతనిపై దాడి చేసింది. అనంతరం సమీపంలోని ఆస్పత్రికి తరలించినా ప్రాణాలను కాపాడలేకపోయారు. వీడియో జర్నలిస్టు మృతి పట్ల అటవీ, వన్యప్రాణి సంరక్షణ మంత్రి ఎకె శశీంద్రన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
 
ఎవి ముఖేష్ చాలా కాలంగా టీవీ ఛానల్ ఢిల్లీ బ్యూరోలో పనిచేస్తున్నారు మరియు గత సంవత్సరం మాత్రమే అతను పాలక్కాడ్ బ్యూరోకు బదిలీ అయ్యాడు.