శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

తెలంగాణాలో వేసవి సెలవులు ఎప్పటి నుంచంటే....

Students
తెలంగాణ రాష్ట్రంలో వేసవి సెలవులపై ఓ క్లారిటీ వచ్చింది. ఏప్రిల్ మూడో తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. అదే నెల 25వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవు ఇస్తారు. మార్చి రెండో వారం నుంచి ఒక్కపూట బడులను నిర్వహిస్తామని ఆ రాష్ట్ర విద్యా శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
మరోవైపు, ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్‌‍మెంట్-2 పరీక్షల తేదీల్లో కూడా మార్పులు చేసింది. ఇప్పటికే విడుదల చేసి షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ పది నుంచి ఈ పరీక్షలు ప్రారంభంకావాల్సివుంది. కానీ, ఎస్ఏ-2 పరీక్షలను ఏప్రిల్ 12 నుంచి ప్రారంభిచనున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది. అయితే, పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 
 
మార్చి రెండో వారం నుంచి రాష్ట్రంలో స్కూళ్లకు ఒంటిపూట నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థుల పరీక్షలు ఏప్రిల్ 12 నుంచి 17వ తేదీ వరకు, 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి నిర్వహించనున్నట్టు తెలిపింది.
 
ఏప్రిల్ 21న ఫలితాల వెల్లడి, ఏప్రిల్ 24న అన్ని పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి 25 నుంచి సెలవులు ఇవ్వనున్నట్టు తెలిపింది. పాఠశాలలు అన్నీ తిరిగి జూన్ 12వ తేదీన ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు అంటచే 48 రోజులపాటు విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు.