నూతన కేంబ్రిడ్జ్ బ్లెండెడ్ లెర్నింగ్ రిసోర్శెస్‌తో హైదరాబాద్ విద్యార్థులు ఇప్పుడు ఐఈఎల్‌టీఎస్ కోసం మెరుగ్గా సిద్ధం కావొచ్చు
ఐఈఎల్‌టీఎస్ పరీక్ష సహ యజమాని కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్ అండ్ ఎస్సెస్‌మెంట్ నేడు తమ ఐఈఎల్‌టీఎస్ ప్రొడక్ట్స్ ప్రింట్, డిజిటల్ ఎడిషన్స్‌ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నూతన సమ్మిళిత ఉత్పత్తులను ఐఈఎల్‌టీఎస్ అభ్యర్థులకు తోడ్పడే రీతిలో తీర్చిదిద్దారు.
అభ్యాసకుల అవసరాలను పరిగణలోకి అత్యంత జాగ్రత్తగా తీర్చిదిద్దడం వల్ల అభ్యర్థులు తమ ప్రస్తుత స్థాయిని పరీక్షించుకోవచ్చు. హైదరాబాద్ వ్యాప్తంగా మరిన్ని కేంబ్రిడ్జ్ లెర్నింగ్ పార్టనర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్ అండ్ ఎస్సెస్‌మెంట్ వెల్లడించింది.
అరుణాచలం టీకె, కంట్రీ హెడ్, సౌత్ ఆసియా, కమర్షియల్ మాట్లాడుతూ, ఎంతోమంది అభ్యర్థులు ఐఈఎల్‌టీఎస్ పరీక్షను ఒక్కసారే పూర్తి చేయలేరు. దీని కారణంగా సమయం, నగదు, శక్తి వృథా అవుతుంది. దీనికి ప్రధాన కారణం పరీక్షకు సిద్ధమయ్యేందుకు అధీకృత వనరులు లేకపోవడం.
ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ ప్రింట్, డిజిటల్ రిసోర్సెస్‌ను సృష్టించాము. ఐఈఎల్‌టీఎస్ సహ యజమానిగా కేంబ్రిడ్జ్ ఇప్పుడు ఐఈఎల్‌టీఎస్ పరీక్షలకు సరైన మెటీరియల్‌ను అందించగలదు. సరిగా సిద్ధమైతే తొలి ప్రయత్నంలోనే వారు అత్యుత్తమ స్కోర్ సాధించగలరు అని అన్నారు.