మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2024 (19:11 IST)

శ్రీవారి లడ్డూలో ఏమైనా కలిపివుంటే నేను.. నా కుటుంబం సర్వనాశనమైపోతాం... భూమన (Video)

bhumana
పరమ పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం అపవిత్రమైన పదార్థాలను కలిపివుంటే తాను, తన కుటుంబ సర్వనాశనమైపోతామని తితిదే మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం తితిదే ఆలయ ప్రధాన ధ్వజస్తంభం ముందు నిలబడి, కర్పూరం వెలిగించి ప్రమాణం చేశారు. తిరుమలలో జరుగుతున్న నెయ్యి కల్తీపై ఆలయం ముందు ప్రమాణం చేశారు. 
 
తాను తప్పు చేసి ఉంటే తిరుమల లడ్డులో ఏమైనా కలిపి ఉంటే నేను నా కుటుంబం సర్వనాశనం అయిపోతాం అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతకుముందు ఆయన తిరుమల పుష్కరిణిలో స్నానం చేస్తారు. అనంతర అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అందిస్తారు. ఆ తర్వాత శ్రీవారి ఆలయం ఎదుట ప్రమాణం చేశారు.