మహిళా వాలంటీర్‌కు వీఆర్వోల వేధింపులు

rape
ఎం| Last Modified గురువారం, 6 మే 2021 (17:52 IST)
కోవెలకుంట్ల,: మండలంలో పని చేస్తున్న ఇద్దరు వీఆర్వోలు తనతో అసభ్యకరంగా మాట్లాడుతూ వేధిస్తున్నారని ఓ మహిళా వాలంటీర్‌ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.

సదరు వాలంటీర్‌ స్థానికంగా లేదన్న నెపంతో బెదిరిస్తూ తరచూ ఫోన్లు చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతుండటంతో ఆమె విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు ఆ ఇద్దరు వీఆర్వోలను స్టేషన్‌కు పిలిపించి గట్టిగా మందలించినట్లు తెలిసింది. ఇది తెలిసిన ఓ ప్రజాప్రతినిధికి తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఇలాంటి ఘటనల వల్ల తమకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, తాను చర్యలు తీసుకోకముందే బదిలీపై వెళ్లాలని హెచ్చరించినట్లు సమాచారం.

ఈ విషయమై ఎస్సై చంద్రశేఖర్‌రెడ్డితో మాట్లాడగా.. సమస్య తమ దృష్టికి రావడంతో ఇద్దరు వీఆర్వోలను పిలిపించి హెచ్చరించామని, రాత పూర్వకంగా ఫిర్యాదు లేదన్నారు.దీనిపై మరింత చదవండి :