మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 3 జులై 2021 (09:03 IST)

వాహన మిత్ర లబ్దికి 6 వరకు దరఖాస్తులు

ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 2021-22 సంవత్సరానికి గానూ వైఎస్సార్ వాహన మిత్ర పథకానికి దరఖాస్తు చేసుకోని అర్హులైన సొంత వాహనం కలిగిన ఆటో, టాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్ కమ్ ఓనర్ అన్నదమ్ముల సౌకర్యార్థం 6 జులై, 2021 వరకు దరఖాస్తు చేసుకునే తేదీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ  చేసామని రవాణా, సమాచార, పౌర సంబంధాల శాఖ మాత్యులు పేర్ని నాని తెలిపారు. 
 
2021-22 సంవత్సరానికి గానూ 15 జూన్, 2021న 2,48,468 మంది వాహనదారులకు రూ.249 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి అందజేశారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దరఖాస్తు చేసుకునే కాలాన్ని 6 జులై, 2021 వరకు పెంచినట్లు మంత్రి వెల్లడించారు.

వైఎస్సార్ వాహన మిత్ర పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా అర్హులైన ఆటో, టాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్ అన్నదమ్ములు మిగిలిపోయి ఉంటే 6 జులై, 2021 వరకు తమ తమ పరిధిలోని గ్రామ /వార్డు సచివాలయాల్లో అవసరమైన అన్ని పత్రాలు సమర్పించి, దరఖాస్తు చేసుకొని వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి  కోరారు.