గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 29 జనవరి 2021 (10:20 IST)

ఏప్రిల్‌ 22 నుంచి వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు

తూర్పుగోదావరి జిల్లా కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలను ఏప్రిల్‌ 22 నుంచి 28వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు తీర్మానించారు.

ఆలయంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో పలు అభివృద్ధి పనులపై చర్చించారు. కల్యాణో త్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్న దృష్ట్యా టెండర్ల ద్వారా పనులు చేపట్టాలని తీర్మానించారు.

ప్రాకార మండపం నిర్మాణ పనులను భక్తులకు అనువుగా ప్రదక్షిణలు ఏర్పాటు చేయడంతో పాటు ఆలయ ప్రాంగణమంతా ఫ్లోరింగ్‌ చేపట్టేందుకు తీర్మానించారు.

ఆధునిక పద్ధతిలో ఆధ్యాత్మిక హంగులతో కూర్చునేందుకు చర్యలు చేపట్టారు. ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు పెన్మెత్స సురేష్‌రాజు, మెర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.