శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: సోమవారం, 5 అక్టోబరు 2020 (19:00 IST)

గన్నవరంలో వైసిపి వల్లభనేని వంశీ హవా: యార్లగడ్డ వెంకట్రావు గరంగరం

గన్నవరం నియోజకవర్గం వైసీపీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తరపున గెలిచి వైసీపీలోనికి దొడ్డిదారిన వచ్చి గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీలోనికి వంశీ వచ్చాక నియోజిక వర్గంలోనికి అడుగు పెట్టకూడదని అనుకున్నానని చేప్పారు.
 
కానీ అసలైన పార్టీ కార్యకర్తలు అవమానాలకు గురవుతున్నారని, కేసుల పాలవుతున్నారని, ఇవన్నీ చూడలేక మళ్లీ నియోజక వర్గంలో అడుగుపెట్టానని తెలిపారు. మరోవైపు తన జన్మదిన వేడుకలను నిర్వహించకుండా పోలీసులు ఆంక్షలు విధించడంపై యార్లగడ్డ మండిపడ్డారు. నున్నలో కార్యకర్తలు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి భారీ కాన్వాయ్‌లో ఆయన వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
 
సెక్షన్ 144 అమలులో ఉందని ఇంతమంది రావడానికి వీలు పడదని చెప్పారు. దీంతో పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్థానికంగా ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ వంశీపై విమర్శలు గుప్పించారు.