శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 సెప్టెంబరు 2024 (10:35 IST)

వంగవీటి రాధాకృష్ణకు స్వల్ప గుండెపోటు.. ఏమైంది?

Vangaveeti
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. రాధా ఆరోగ్యం గురించి డాక్టర్లు స్పందిస్తూ... ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. 48 గంటల పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు. 
 
విజయవాడలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రాధా ఆరోగ్యం గురించి డాక్టర్లు స్పందిస్తూ... ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. 48 గంటల పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు.
 
వంగవీటి రాధా గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుపు కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రచారం చేశారు. ఆయన ఎన్నికల్లో పోటీచేస్తారని ప్రచారం జరిగినా ఆయన మాత్రం ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 
 
కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం అయ్యారు. చంద్రబాబు కూడా వంగవీటి రాధాకు కచ్చితంగా సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తామని ప్రకటించారు.