శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 21 ఆగస్టు 2020 (14:30 IST)

రఘురామకృష్ణరాజుకి దమ్ముంటే తన నియోజకవర్గానికి వచ్చి ఆ పని చేయాలి: వెల్లంపల్లి

ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నరసాపురం ఎంపీ రఘురామక్రిష్ణం రాజు మీద విరుచుకుపడ్డారు. శుక్రవారం ఉదయం తిరుమలలో శ్రీవారి దర్శించుకున్న అనంతరం మీడియాతో వెల్లంపల్లి మాట్లాడారు. డిల్లిలో కూర్చోని రఘురామక్రిష్ణం రాజు నీచమైన ఆరోపణలు చేస్తూన్నారని, జగన్మోహన్ రెడ్డిని ఒక్క కులానికి పరిమితం చేయ్యాలని చంద్రబాబు, రఘురామక్రిష్ణం రాజు కుట్ర చేస్తూన్నారంటూ విమర్శలు గుప్పించారు.
 
ప్రజా శ్రేయస్సు దృష్ట్యా హిందూ మత పెద్దలు, థార్మిక సంస్థలతో చర్చించిన తరువాతే వినాయక చవితి వేడుకలు ఇంటికి పరిమితం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాం అన్నారు. ప్రాణభయంతో 
5 నెలలుగా డిల్లీలో కూర్చున్న రఘురామకృష్ణ రాజు ముందుగా నియోజకవర్గానికి వచ్చి వినాయక చవితి ఉత్సవాలలో పాల్గొనాలి.
 
అంతేకాదు ఎక్కడో కూర్చుని మాట్లాడటం సరికాదు అన్నారు. సామాన్యులు ప్రాణాలు అంటే రఘురామకృష్ణం రాజుకు లేక్కలేదు అని, కేవలం వ్యక్తిగత స్వార్థం తోనే జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.