Venkaiah Naidu: 24 గంటల్లో అత్యధిక వీక్షణలతో బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన.. గిన్నిస్ రికార్డ్
యూట్యూబ్‌లో 24 గంటల్లో అత్యధిక వీక్షణలతో రొమ్ము క్యాన్సర్ అవగాహన పాఠాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కించిన ప్రఖ్యాత సర్జన్ డాక్టర్ పి. రఘురామ్‌ను మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు శనివారం అభినందించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 50వ వార్షికోత్సవం సందర్భంగా 24 గంటల్లో 11,000 మందికి పైగా సాధికారత కల్పించినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించిన రికార్డును సాధించినందుకు ప్రఖ్యాత సర్జన్- పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ రఘు రామ్‌కు అభినందనలు తెలిపారు వెంకయ్య నాయుడు.
అంతకుముందు ఆయన డాక్టర్ రఘురామ్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్‌ను ప్రదానం చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్ -ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్, బ్రహ్మ కుమారీస్ లకు ఇది రెండవ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. కొన్ని రోజుల క్రితం 'లార్జెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ పాఠం' అనే ఆన్‌సైట్ రికార్డును సాధించారు.