క్యాన్సర్ చంపలేదు... ఆస్తి కోసం నా భర్తే చంపేశాడు : తల్లి సుమశ్రీ
నా కుమార్తెను క్యాన్సర్ చంపలేదని ఆస్తి కోసమే నా భర్త చంపేశాడని ఇటీవల క్యాన్సర్ వ్యాధితో మరణించిన సాయిశ్రీ తల్లి సుమశ్రీ ఆరోపించారు. ‘నాన్నా! నన్ను బతికించవూ ప్లీజ్!.. ఇది సాయిశ్రీ వాళ్ల నాన్నతో పెట్ట
నా కుమార్తెను క్యాన్సర్ చంపలేదని ఆస్తి కోసమే నా భర్త చంపేశాడని ఇటీవల క్యాన్సర్ వ్యాధితో మరణించిన సాయిశ్రీ తల్లి సుమశ్రీ ఆరోపించారు. ‘నాన్నా! నన్ను బతికించవూ ప్లీజ్!.. ఇది సాయిశ్రీ వాళ్ల నాన్నతో పెట్టుకున్న మొర. నాన్న ట్రీట్‌మెంట్ చేయిస్తే తను బతుకుతాననుకుంది'. చివరకు ఆ చిన్నారి చనిపోయింది. దీనిపై సుమశ్రీ స్పందిస్తూ...
'పాప ప్రాణాలు పోతే ఆస్తి అంతా తనకే వస్తుందనుకున్నాడు. ముక్కుపచ్చలారని పసిపాప రోదన ఆ రాతిగుండెను కదిలించలేకపోయింది. ఇంతటి దారుణం ఎక్కడా జరిగి ఉండదు. పదమూడేళ్ల నా కుమార్తె సాయిశ్రీ మరణానికి ప్రత్యక్షంగా కారణమయ్యాడు తండ్రి. సాయిశ్రీ తండ్రి ప్రేమకు ఏనాడో దూరమైంది. ఇప్పుడు నా ఒడి నుంచి కూడా దూరంగా వెళ్లిపోయింది. నా పాప ఏం పాపం చేసింది. ఏ తప్పు చేసింది. తనను పుట్టించమని అడిగిందా... లేదే. తనను బ్రతికించమని వేడుకుందన్నారు.
నా బిడ్డ రోదన అతడి పాషాణ హృదయానికి వినిపించలేదా? పశుపక్ష్యాదులు కూడా తమ పిల్లల్ని ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా కాపాడుకుంటాయి. ఈ దానవ తండ్రులకు కన్నసంతానం మీద మమకారం కలగదా. పేగుబంధం కంటే నోటుబంధమే ఎక్కువైందా? ఆదివారం మాతృదినోత్సవంనాడు పిల్లలందరూ తల్లికి బహుమతులు ఇస్తుంటే నా బిడ్డ మాత్రం నాకు గర్భశోకం మిగిల్చి ఎప్పటికీ కనిపించనంత దూరం వెళ్లిపోయిందని ఆమె చెప్పుకొచ్చారు.