శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 ఫిబ్రవరి 2024 (15:13 IST)

షర్మిల రాజశేఖరరెడ్డి కూతురు కాదా.. జగన్ ఏం చేస్తున్నాడు..? వీహెచ్

v hanumantha rao
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సొంత చెల్లెళ్లపై కూడా ప్రేమ లేని జగన్ మహిళా సాధికారతపై మాట్లాడటం విడ్డూరంగా వుందని విమర్శించారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసం, వైసీపీ కోసం షర్మిల ఎంతో కష్టపడిందని అన్నారు. షర్మిల రాజశేఖరరెడ్డి కూతురు కాదని తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టర్లు వేస్తున్నా జగన్ స్పందించడం లేదని వీహెచ్ దుయ్యబట్టారు. 
 
రాజకీయాల కోసం జగన్ ఇంతకు దిగజారుతాడా? అని వీహెచ్ ప్రశ్నించారు. షర్మిల, సునీతలపై జగన్ కు గౌరవం లేదని విమర్శించారు. సొంత చెల్లెళ్లపై కూడా ప్రేమ లేని జగన్ మహిళా సాధికారతపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. సొంత పార్టీ శ్రేణుల నుంచే షర్మిలకు అవమానం జరుగుతున్నా జగన్ పట్టించుకోవడం లేదని అన్నారు.