శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 4 జులై 2017 (05:05 IST)

అక్రమంగా రమిస్తూ, రహస్య రతిని వీడియోలో చిత్రీకరిస్తూ, పోస్ట్ చేస్తూ. దొంగ దొరికాడు

ఇది భర్త తోడు లేకున్నా ఆత్మవిశ్వాసంతో మోటారు సైకిల్‌పై ఊరూరూ వెళ్లి చీరలను విక్రయిస్తూ జీవనం సాగించే ఒక అభాగ్యురాలిపై మగాడి కాటు పడిన కథ. వ్యాపారంలో ఒక మగాడిని నమ్మి హోటల్‌లో బస చేస్తే ఆ ఉండాకోరు ఆమెతో గడిపిన దృశ్యాలను సెల్ ఫోన్ వీడియోకి ఎక్కించి స్

ఇది భర్త తోడు లేకున్నా ఆత్మవిశ్వాసంతో మోటారు సైకిల్‌పై ఊరూరూ వెళ్లి  చీరలను విక్రయిస్తూ జీవనం సాగించే ఒక అభాగ్యురాలిపై మగాడి కాటు పడిన కథ. వ్యాపారంలో ఒక మగాడిని నమ్మి హోటల్‌లో బస చేస్తే ఆ ఉండాకోరు ఆమెతో గడిపిన దృశ్యాలను సెల్ ఫోన్ వీడియోకి ఎక్కించి స్నేహితులకు పోస్ట్ చేసి రతికార్యాన్ని కూడా పంచుకున్నాడు. ఇదేం ఘోరమని నిలిదీస్తే దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు. ఆమె పోలీసులకు చెప్పింది. పోలీసులు సాక్ష్యాధారాలతో సహా అతడి నేరాన్ని నిర్ధారించి జైలుకు పంపారు.
 
బాధిత  మహిళ గతంలో ఉపాధి కోసం కువైట్‌ వెళ్లి అక్కడ కొంత కాలం ఉంది. తర్వాత ఓ వ్యక్తిని వివాహం చేసుకుని ముంబైలో కొన్నాళ్లు కాపురం చేసింది. ఇద్దరి మధ్య గొడవలు రావటతో భర్తను వదిలేసి తన ఇద్దరు  మగ పిల్లలతో చిన్న తిళ్లకుప్పలో నివాసం ఉంటోంది. మోటారు సైకిల్‌పై ఆమె ఊరూరూ వెళ్లి  చీరలను విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది.  సూరిబాబు కారులో వస్త్రాల కొనుగోలుకు ద్వారపూడి, రాజమహేంద్రవరం వెళ్లేది. 
 
ఆమెను సూరిబాబు కారులో తీసుకు వెళుతూ అమలాపురంలోని ఓ లాడ్జిలో, మురమళ్లలోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో కొన్నిసార్లు బస చేశాడు. ఆ సమయంలో సూరిబాబు ఆమెను శారీకంగా అనుభవిస్తూ ఆమెకు తెలియకుండా సెల్‌ఫోన్‌లో వీడియో ద్వారా వారు కలుసుకున్న, నగ్న దృశ్యాలు చిత్రీకరించాడు. వీడియోలో తాను మాత్రం కనిపించకుండా కేవలం ఆమెను మాత్రమే చిత్రీకరించి జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ నీలి దృశ్యాలతో ఉన్న వీడియోను సూరిబాబు తన సెల్‌ఫోన్‌ ద్వారా తన మిత్రుల సెల్‌ఫోన్లకు పంపించాడు.
 
చివరకు ఆ వీడియో బాధితురాలు చూసి నిర్ఘాంతపోయింది. బెడ్‌ రూమ్‌లోని దృశ్యాలను అందరికీ బహిర్గతం చేస్తావా అంటూ బాధితురాలు సూరిబాబును నిలదీసింది. నా ఇష్టం అందరికీ చూపిస్తాను...ఎక్కువగా మాట్లాడితే చంపేస్తానని సూరిబాబు బెదిరించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మురమళ్ల, అమలాపురంలోని అతిథి గృహం, లాడ్జీలో సూరిబాబు ఆమెను నగ్నంగా వీడియో చిత్రీకరించినట్టు ఆధారాలు లభ్యం కావడంతో అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. కోర్టులో హాజరు పరచినట్టు డీఎస్పీ అంకయ్య వివరించారు.