మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 మే 2022 (15:26 IST)

"సర్కారివారి పాట" చిత్రం చాలా బాగుంది : విజయసాయి రెడ్డి

vijayasai reddy
ప్రిన్స్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కి, గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన చిత్రం "సర్కారువారి పాట". ఈ చిత్రానికి ప్రేక్షల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే, ఈ చిత్రాన్ని చూసిన వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు ఆయన గురువారం మధ్యాహ్నం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం సర్కారువారి పాట బాగుందని సదరు ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు. సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంకులు చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించారు అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.