వైసిపి నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఆ టైపే... విజయ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన నేతలందరిపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. ఎమ్మెల్యేలందరూ ఆ టైపే అని మండిపడ్డారు. ఒక పార్టీ గుర్తుతో గెలిచినప్పుడు ఆ పార్టీని వద్దనుకున్నప్పుడు పదవికి కూడా రాజీనామ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన నేతలందరిపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. ఎమ్మెల్యేలందరూ ఆ టైపే అని మండిపడ్డారు. ఒక పార్టీ గుర్తుతో గెలిచినప్పుడు ఆ పార్టీని వద్దనుకున్నప్పుడు పదవికి కూడా రాజీనామా చేసి వెళ్ళాలి. అంతేతప్ప ఇంకా ఎమ్మెల్యే పదవిని పట్టుకుని ఊగులాడటం ఏమిటని ప్రశ్నించారు సాయిరెడ్డి.
ఎప్పుడూ నిదానంగా మాట్లాడే విజయసాయిరెడ్డి ఈ స్థాయిలో మండిపడటంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న జగన్ కూడా ఎప్పుడూ వెళ్ళిపోయిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడలేదు. పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి గురించి కూడా ఎక్కడా జగన్ పెద్దగా స్పందించలేదు. అలాంటిది విజయసాయి రెడ్డి మాట్లాడటం ఆ పార్టీ నేతలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.