గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: బుధవారం, 7 జులై 2021 (11:10 IST)

బూబూ... నీకెందుకు జన్మనిచ్చానా అని చిత్తూరు ఏడుస్తోంది

చంద్ర‌బాబూ... నీకు ఎందుకు జ‌న్న ఇచ్చానా అని నీ సొంత గ‌డ్డ చిత్తూరు ఏడుస్తోంద‌ని ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి ఎద్దేవా చేశారు. సొంత జిల్లాలోని సాగునీటి ప్రాజెక్ట్‌లకు అడ్డుతగులుతూ, తన అనూనయులతో గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్లు వేయించిన చంద్రబాబు రైతు ద్రోహి అన్నారు. అలాంటి వ్యక్తి చిత్తూరు గడ్డపై పుట్టడం ఆ జిల్లావాసుల దురదృష్టమని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు. 
 
గతంలో సీఎం రాజ‌శేఖ‌ర్ రెడ్డి చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్ట్‌లపై ప్రసాద్ నాయుడు అనే చెంచాతో కేసులు వేయించి రెండేళ్లు అడ్డుకున్న చంద్రబాబు ... ఇప్పుడు సీమ ఎత్తిపోతల పథకంతో పాటు సీఎం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చిత్తూరు జిల్లా ప్రాజెక్టులకు అడ్డుతగులుతున్నాడని ఆరోపించారు.  అప్పట్లో మహానేత వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞంను ప్రసాద్ నాయుడు చేత అడ్డుకున్నార‌ని... ఇపుడు చిత్తూరు ప్రాజెక్టులపై స్టే కోరుతూ తన వాళ్ళతో గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్లు వేయించిన రైతు ద్రోహి అని విమ‌ర్శించారు.

రైతులు చల్లగా ఉంటే ఓర్వలేని చంద్రబాబు.. సొంత జిల్లా ప్రాజెక్ట్‌లపైనే స్టే కోరుతూ తన వాళ్ళతో పిటిషన్లు వేయించాడని ఆరోపించారు. తనకు రాజకీయ బిక్షపెట్టిన సొంత గడ్డకు మేలు చేయాల్సింది పోయి, సాగునీటి ప్రాజెక్ట్‌లకు అడ్డుతగులుతూ, ఆ ప్రాంత రైతుల కడుపు కొడుతున్నాడ‌ని విమ‌ర్శించారు.

తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం, పిల్లను, పదవిని ఇచ్చిన మామకు వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజమని ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లాలోని 1.10లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే 3 రిజర్వాయిర్లను అడ్డుకునేందుకు ఎన్జీటీలో పిటిషన్లు వేయించిన చంద్రబాబును చూసి, నీకెందుకు జన్మనిచ్చానా అని సొంత జిల్లా కన్నీరు పెడుతోందని పేర్కొన్నారు.