కేసీఆర్ కాళ్లు మెుక్కిన విజయసాయిరెడ్డి

vijayasai-kcr
ఎం| Last Updated: సోమవారం, 13 జనవరి 2020 (23:35 IST)
తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ప్రగతిభవన్‌లో కొనసాగుతోంది. ప్రగతిభవన్‌కు వచ్చిన జగన్‌కు కేసీఆర్, కేటీఆర్ ఎదురెళ్లి స్వాగతం పలికారు. సరిగ్గా ఇద్దరు సీఎంలు భోజన సమయంలో కలిశారు. దీంతో కేసీఆర్‌తో కలిసి జగన్ భోజనం చేశారు. అయితే ప్రగతిభవన్‌లో ఆసక్తికర సన్నివేశం జరిగింది.

జగన్‌తో పాటుగా ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ప్రగతిభవన్‌కు వచ్చారు. జగన్‌తో మాట్లాడుతున్న సమయంలో విజయసాయిని గమనించిన కేసీఆర్, ఆయన్ను పలకరించేందుకు ఆగారు. ఇది గమనించిన విజయసాయి మర్యాదపూర్వకంగా కేసీఆర్‌కు పాదాభివందనం చేసేందుకు ముందుకు వంగారు.

వెంటనే విజయసాయిని ఆపేందుకు కేసీఆర్ ప్రయత్నించారు. ఈ లోపే సగం నడుమువంచిన విజయసాయి, కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు.
దీనిపై మరింత చదవండి :