శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2019 (18:02 IST)

సంపూర్ణ అక్షరాస్యత సవాల్ స్వీకరించండి: కేసీఆర్ పిలుపు

2020 నూతన సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ఆవిర్భవించిన కేవలం ఆరేళ్ల స్వల్ప వ్యవధిలోనే అనేక విషయాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలవడం గర్వకారణమని సిఎం అన్నారు.

సాధించిన విజయాలను స్పూర్తిగా తీసుకుని కొత్త సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం మరింత ముందడుగు వేస్తుందని సిఎం ఆకాంక్షించారు.  తెలంగాణను వందశాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రజలు నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా ప్రతిన తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు.

ఈచ్ వన్ టీచ్ వన్ అనే నినాదం అందుకుని ప్రతీ ఒక్క చదువుకున్న విద్యావంతుడు నిరక్షరాస్యుడైన మరొకరిని అక్షరాస్యులుగా మార్చాలని సిఎం కోరారు. తెలంగాణను సంపూర్ణ అక్షరాస్యత సాధించే సవాల్ స్వీకరించాలని పిలుపునిచ్చారు.