శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2019 (09:20 IST)

స్టాఫ్‌నర్సుపై అత్యాచారం.. ఎవరు.. ఎక్కడ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య రాజధానిగా ఉన్న విజయవాడలో ఓ స్టాఫ్ నర్సుపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ముఖ్యంగా, బాధితురాలు స్థానికంగా ఉండే ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో పని చేస్తుండటం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్న మొవ్వకు చెందిన యువతి తన సోదరుడితో కలిసి గుణదలలో నివసిస్తోంది. కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న వినోద్ అనే యువకుడు గత నెల 4వ తేదీన ఆమెపై ఇంట్లోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
పైగా, ఈ విషయం బయటకు చెపితే చంపేస్తానని బెదిరించాడు. అంతేకాదు, అత్యాచార  ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఈ నెల 26వ తేదీన ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 
 
దీన్ని గమనించిన ఇరుగుపొరుగువారంతా ఆమెను రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత వైద్యులు ఆమె ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పిమ్మట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.