ఫామ్‌హౌస్‌లో భర్తను కట్టేసి.. భార్యపై సామూహిక అత్యాచారం
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని మహేశ్వరంలో భర్త కళ్లెదుటే భార్యపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. హైదరాబాద్, పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ వివరాలను పరిశీలిస్తే, నాగర్‌కర్నూలు జిల్లా ఎనిమిల్లతండాకు చెందిన చందు భార్యాపిల్లలతో కలిసి మహేశ్వరం మండలంలోని హర్షగూడలో నివసిస్తూ స్థానికంగా ఉండే ఓ ఫామ్‌హౌస్‌లో పని చేస్తున్నాడు.
ఈ క్రమంలో ఈ నెల 18వ తేదీన ఫాంహౌస్ యజమానులు రంగారెడ్డి, ప్రతాప్ రెడ్డిలతో గొడవ పడ్డాడు. ఇది కాస్తా పెద్దది కావడంతో చందు, అతడి భార్యను వారు ఫాంహౌస్‌లో బంధించారు. అనంతరం చందు భార్యను మరో గదిలోకి తీసుకెళ్లి రంగారెడ్డి, ప్రతాప్ రెడ్డితోపాటు మరో ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.