వేణుమాధవ్ ఇకలేరా..? షాకైన యూసుఫ్ పఠాన్ (video)
టాలీవుడ్ హాస్యనటుడు వేణుమాధవ్ ఇక లేరనే విషయాన్ని తెలుసుకున్న యూసుఫ్ పఠాన్ షాకయ్యాడు. వేణు మృతిపై గుజరాత్‌కు చెందిన యూసుఫ్ పఠాన్ స్పందించడంపై ప్రేక్షకులు, సినీజనం ఆశ్చర్యపోతున్నారు. యూసుఫ్ తెలుగు వాడు కాదు. గుజరాతి. అయితే వేణు మాధవ్ తెలుగు సినిమాల్లో కనిపించాడు. అలాంటిది.. వేణు కామెడీ గురించి యూసుఫ్‌కు ఎలా తెలిసివుంటుందని అందరూ ఆశ్చర్చపోతున్నారు
అయితే వేణు మాధవ్ మృతిపై యూసుఫ్ పఠాన్ స్పందించడం వెనుక కారణం వుంది. గత కొన్నేళ్లుగా హిందీలో తెలుగు సినిమాలు డబ్బింగ్ రూపంలో పలకరిస్తున్నాయి. అందులో ముఖ్యంగా సై, ఛత్రపతి హిందీ డబ్బింగ్ వెర్షన్‌తో పాటు వేరే సినిమాల్లో వేణు మాధవ్ కామెడీ చూసి యూసుఫ్ పఠాన్ ఆయనకు ఫ్యాన్ అయినట్లు తెలుస్తోంది. తెలుగు డబ్బింగ్ సినిమాలకు హిందీలో చాలా పాపులారిటీ ఉండటంతో.. అలా వేణు ఉత్తరాదివాళ్లతో యూసుఫ్ పటాన్‌కు కూడా దగ్గరై ఉంటాడని జనం అంటున్నారు.
మరోవైపు యూసుఫ్ పఠాన్.. హైదరాబాద్ సన్ రైజర్స్ తరుపున ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడారు. ఈ సందర్భంగా హీరో వెంకటేష్ తరచూ ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు వచ్చేవారు. ఈ సందర్భంగా వేణుకు యూసుఫ్ పఠాన్ పరిచయమై వుంటుందని.. వీరి పరిచయానికి వెంకటేష్ కారణమని కూడా సన్నిహిత వర్గాల సమాచారం. అందుకే ఆయన మృతి చెందిన సమాచారం అందగానే యూసుఫ్ పఠాన్.. సంతాపం వ్యక్తం చేశాడు.
ఇకపోతే.. వేణుమాధవ్ అంత్యక్రియలు ముగిశాయి. నగరంలోని మౌలాలి హౌజింగ్ బోర్డ్ లక్ష్మీనగర్ శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు వేణుమాధవ్ దహన సంస్కారాలు నిర్వహించారు. వేణుమాధవ్ పెద్ద కుమారుడు చితికి నిప్పంటించాడు. ఫిలిం చాంబర్ నుంచి ప్రారంభమైన అంతియ యాత్రలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు వేణుమాధవ్‌కు కడసారి నివాళులర్పించారు.
టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగిన వేణుమాధవ్ 350కి పైగా సినిమాల్లో నటించారు. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ల సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రల్లో కనిపించారు. కొంత కాలంగా సినీరంగానికి దూరంగా ఉంటున్న ఆయన, కాలేయ సంబంధిత వ్యాదితో బుధవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.