సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 అక్టోబరు 2023 (22:12 IST)

బాత్రూమ్‌లో తలదాచుకున్న వరుడు.. 100కి ఫోన్ చేశాడు.. ఎందుకు?

marraige
పెళ్లికి ముందు వారం రోజులు పెళ్లి కొడుకుతో పెళ్లి కూతురు ఫోన్‌లో మాట్లాడలేదనే కోపంతో అలిగి.. పెళ్లి చేసుకునేందుకు ఓ వరుడు నిరాకరించాడు. ఇంకా పెళ్లి వద్దని బాత్రూమ్‌లో దాక్కున్నాడు. ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది. 
 
విశాఖకు చెందిన యువతితో, గోపాలపట్నం ప్రాంతానికి చెందిన యువకుడికి పెద్దల సమక్షంలో వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. సంప్రదాయ వస్త్రాలు ధరించిన వధువు, వరుడు మండపంలో పెళ్లి పీటలపై కూర్చోబోతున్నారు. 
 
పది నిమిషాల్లో పెళ్లి జరుగనుండగా ఇంతలో వరుడు ట్విస్ట్ ఇచ్చాడు.. పెళ్లి చేసుకోను అంటూ నిరాకరించడంతో, వధువు తరఫు వారంతా అవాక్కయ్యారు. అతనితో వాదించారు. దీంతో జడుసుకున్న వరుడు భయాందోళనకు గురైన వరుడు బాత్రూమ్‌లోకి వెళ్లి తలదాచుకున్నాడు. 
 
అక్కడి నుంచే డయల్‌ 100కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రెండు కుటుంబాలతో చర్చించారు. ఏ కారణమూ లేకుండానే పెళ్లికి నిరాకరించిన వరుడి ప్రవర్తనపై వధువు తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 
 
ఓ గంటలో పెళ్లి జరగాల్సి ఉండగా.. వివాహం వద్దని వరుడు ముఖం చాటేయడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.