సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 30 మే 2017 (20:26 IST)

విశాఖ భూదందాపై ఉక్కుపాదం... కేఈ క్రిష్ణమూర్తి

విశాఖ భూ దందాపై బహిరంగ విచారణ చేపడతామన్నారు ఉప ముఖ్యమంత్రి కే.ఈ క్రిష్ణమూర్తి. విశాఖ జిల్లాలోని భూ రికార్డుల మార్పిడిపై వెల్లువెత్తుతున్న ఆరోపణలను పరిశీలించి, పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ముందుగా సి.సి.ఎల్.ఏ కార్యాలయం నుండి సీన

విశాఖ భూ దందాపై బహిరంగ విచారణ చేపడతామన్నారు ఉప ముఖ్యమంత్రి కే.ఈ క్రిష్ణమూర్తి. విశాఖ జిల్లాలోని భూ రికార్డుల మార్పిడిపై వెల్లువెత్తుతున్న ఆరోపణలను పరిశీలించి, పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ముందుగా సి.సి.ఎల్.ఏ కార్యాలయం నుండి సీనియర్ అధికారుల బృందాన్ని విశాఖలో రికార్డులను పరిశీలించడానికి పంపుతున్నామని, జూన్ 15వ తేదీన ఉదయం 11 గంటలకు విశాఖపట్నం కలెక్టరేట్లో బహిరంగ విచారణ చేపడతామన్నారు. 
 
తనతో పాటు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు విచారణలో పాల్గొంటారని తెలిపారు. బాధిత ప్రజలు ఎవరైనా వచ్చి తగిన ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లైతే, సమస్య తప్పక పరిష్కరిస్తామన్నారు. బాధితులు ఎవరూ రాజకీయ వత్తిడులకు లొంగాల్సిన అవసరం లేదని, విశాఖ భూ దందా విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు.