మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 ఆగస్టు 2022 (11:03 IST)

విశాఖలో మంకీపాక్స్ కలకలం.. వైద్య విద్యార్థికి అనుమానిత లక్షణాలు

monkeypox
విశాఖలో మంకీపాక్స్ కలకలం రేపింది. విశాఖ నగరంలోని ఒక ప్రైవేటు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చివరి ఏడాది చదువుతున్న వైద్య విద్యార్థికి మంకీపాక్స్‌ అనుమానిత లక్షణాలున్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. దీంతో ఆరోగ్యశాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. రాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ను ఆ వైద్య కళాశాలకు పంపాలని ఆంధ్ర వైద్యకళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బుచ్చిరాజుకు లేఖ రాశారు. 
 
కళాశాలకు చెందిన మెడిసిన్‌, డెర్మటాలజీ, ఎస్పీఎం, మైక్రోబయాలజీ విభాగాల సహాయ ప్రొఫెసర్లు, ఇద్దరు టెక్నీషియన్లతో కూడిన బందాన్ని శుక్రవారం మధ్యాహ్నం ఆ వైద్యకళాశాలకు పంపారు. 
 
శనివారం నమూనాలు సేకరించి పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపనున్నారు. కేవలం అనుమానిత లక్షణాలేనని, అయినా అప్రమత్తంగా ఉన్నామని వైద్యాధికారులు తెలిపారు. 
 
విద్యార్థి కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు శనివారం హైదరాబాద్‌ నుంచి విశాఖ చేరుకునే అవకాశం ఉంది. ఆ విద్యార్థిని కలిసినవారి వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు.