గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 డిశెంబరు 2022 (20:06 IST)

సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కారు శుభవార్త

ys jagan
సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కారు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ సెలవులు లేని వారికి .. ఇకపై అన్ని ప్రభుత్వ సెలవులు వర్తిస్తాయని పేర్కొంటూ జగన్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగుల సెలవులపై తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చారు. 
 
కాగా.. ఐదు నెలల క్రితమే సచివాలయ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. ఇప్పటివరకూ వారి సెలవుల విషయంలో ప్రొహిబిషన్ విధానమే అమలవుతోంది.
 
అలాగే రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించే అన్నిరకాల సెలవులు వార్డు పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శులతో పాటు సచివాలయ ఉద్యోగులందరికీ వర్తింపజేసేలా నిర్ణయం తీసుకుంది.