శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 29 జులై 2019 (19:05 IST)

శాంతిభద్రతల విషయంలో నిష్కర్షగా ఉంటాం..ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీపడం అని, నిష్కర్షగా ఉంటామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చాలా సూటిగా స్పష్టంగా కలెక్టర్లు, ఎస్పీల కాన్ఫరెన్స్ లో స్పష్టం చేశారని, అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయినా ఏవైనా (ఇల్లీగల్ యాక్టివిటీస్)చట్ట వ్యతిరేక వ్యవహారాల్లో పాల్గొంటే అంగీకరించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టంగా చెబుతున్నా ప్రతిపక్షం అనుమానాలు వ్యక్తం చేయటం ఏమిటని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు.
 
"గత ప్రభుత్వం హయాంలో 2014 సెప్టెంబరులో మొదటిసారి ఏర్పాటైన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో నాకు (చంద్రబాబు) మీరు ముఖ్యం కాదు. నా (టీడీపీ) పార్టీ ముఖ్యం. మా (టీడీపీ నేతలు)వాళ్లు ఏం  చేసినా మీరు (కలెక్టర్లు, ఎస్పీలు) సపోర్ట్ చేయాలి. అని చంద్రబాబు బాహాటంగానే చెప్పారు. ఇదే విషయాన్ని అన్ని పేపర్లు కథనాలు ప్రచురించాయని బుగ్గన గుర్తు చేశారు. గ్రామస్థాయిలో కొన్నిజరగొచ్చు.

దీనికి రాజకీయ కారణాలు ఉండవు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు సామాన్య ప్రజల జీవితాల్లోకి వెళ్లిపోయారు. ఎలా అంటే పింఛన్లు తీసుకునే ప్రతి ఒక్కరూ ముడుపులు ఇవ్వాల్సి వచ్చింది. బియ్యం తీసుకునే వారు, సబ్సిడీలు, లోన్లు తీసుకోవాలాంటే జన్మభూమి కమిటీలకు ముడుపులు ఇవ్వనిది ఏ ఒక్కరికీ అవి రాలేదు. రైతుల రథాలు మామూళ్లు, కమీషన్లు ఇవ్వనిది ఎవ్వరికీ ఇవ్వలేదు.

భూ రికార్డులు కంప్యూటరీకరణ పేరుతో నాలుగైదు తరాలుగా అనుభవిస్తున్న యాజమానుల పేర్లు మార్చి టీడీపీ కార్యకర్తల పేర్లు ఎక్కించుకొని దొంగ పాస్ బుక్కులు, టైటిల్స్ తెచ్చుకొని అమ్ముకున్నారు. టీడీపీ వారు అమ్ముకున్న పాపానికి మూడు నాలుగు తరాల నుంచి హక్కులు అనుభవిస్తున్న భూమి యజమానులు అందరూ నేడు కోర్టులకు వెళ్లే పరిస్థితి వచ్చింది. ఇవేకాకుండా పోలీస్ స్టేషన్ల బయట, తహశీల్దార్ల ఆఫీసుల బయట, జన్మభూమి కమిటీల సభ్యులు కన్సల్టెంట్లు మాదిరిగా ఆఫీసులు పెట్టుకొని నడుపుకున్నారు.

చివరికి లెట్రిన్ (మరుగుదొడ్లు) బిల్లులు కూడా తిన్నారు. ఆ లెట్రిన్ బిల్లులు రాని వ్యక్తికి కోపం ఉండొచ్చు. భూమి వేరే వ్యక్తి పేరు మీద మార్చుకొని ఉంటే ఆ వ్యక్తికి కోపం ఉండొచ్చు. ఇళ్లు రావాలన్నా,లోన్లు రావాలన్నా జన్మభూమి కమిటీలు, కార్యకర్తల చుట్టూ తిరిగిన వారికి కోపం ఉండొచ్చు.

ప్రభుత్వం ఎప్పుడైతే మారుతుందో..కొద్దో.. గొప్పో కోపం బయటకు వచ్చి ఉండొచ్చు. కానీ ఇక్కడ సారాంశం ఏమిటి అంటే.. ప్రజలకు ఎన్ని రకాలు కోపాలు ఉన్నా.. ప్రభుత్వం, ముఖ్యమంత్రి పోలీసు శాఖకు, కలెక్టర్లకు స్వేచ్ఛ ఇచ్చారు. అది ముఖ్యమైన అంశం కానీ ఎక్కడో ఏదో ఒక సంఘటన చూసి రాలేదంటే అది కరెక్ట్ కాదు. 
 
వైయస్ఆర్ రైతు భరోసా..
రూ.12,500లు వైయస్ఆర్ రైతు భరోసాను రెండేళ్ల క్రితమే జగన్ గారు ప్రకటించారు. ఆ తర్వాత ఎన్నికలకు రెండు నెలల ముందు (మే నెలలో ఎన్నికలు) రూ.6,000 ఇస్తామని కేంద్ర ప్రభుత్వమూ ప్రకటించిన మాట వాస్తవమే.సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీంలు, సెంట్రల్ అసిస్టెంట్ స్టేట్ స్పాన్సర్స్ స్కీంలు (సీఏఎస్పీ, సీఏఎస్ఎస్) ఉంటాయి. 
 
సీఏఎస్పీ కిందకు వస్తే.. ఆటోమ్యాటిక్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి  వచ్చేది మన వాటా కింద తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో పన్నులు కట్టేవి డివిజబుల్ పూల్ లోకి వెళ్తాయి. డివిజబుల్ పూల్ లోనుంచి కొంత డబ్బులు రాష్ట్రానికి వెళ్తాయి. కేంద్రానికి కొంత వాళ్ల ప్లాన్ కిందకు వస్తాయి. 
 
ఇక్కడ మనకు గమనించాల్సింది ఏమిటి అంటే..?
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రెండేళ్ల క్రితం చెప్పిన మాట. పోలవరంకు గోదావరి-కృష్ణా, గోదావరి-పెన్నా నీటి తరలింపు గురించి టీడీపీ సభ్యులు మాట్లాడారు. పోలవరం కంప్లీట్ సపరేట్ సబ్జెక్ట్. పోలవరం జరుగుతుంది. వాళ్ల పుణ్యాన ఆలస్యం అయింది. గత టీడీపీప ప్రభుత్వం పుణ్యాన ఆలస్యం జరిగింది.

2014లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే 2016 సెప్టెంబరు వరకు అక్కడ స్పెషల్ మిడ్ నైట్ ప్యాకేజీ మాట్లాడుకునే వరకు రెండున్నర సంవత్సరం ఏం చేసినట్లు? ఎందుకు పోలవరం గురించి మాట్లాడలేదు? దాని గురించి ఊసేలేదు ఎందుకు? వాళ్ల వల్లే ఆలస్యం అయింది. ఈ రోజుసత్వరం వేగంగా పూర్తి చేయటానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము.

అది కాకుండా గోదావరి జలాలు కృష్ణా ఆయకట్టుకు, రాయలసీమ ప్రాంతానికి రావటానికి ఎన్నెన్ని మార్గాలున్నాయో ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు. సభ్యులు ఈ విషయంలో అంతగా దిగులుపడాల్సిన అవసరం లేదు. వారి మాటల్లో చూస్తే బిల్లు కంటే కేసీఆర్ గురించి ఎక్కువ మాటలు వినబడ్డాయ్. కేసీఆర్ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి. కర్ణాటక ముఖ్యమంత్రి అయినా, నవీన్ పట్నాయక్ అయినా వాళ్లంతా పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రులు. వాళ్లు అంత భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు. 
 
అమ్మఒడి గురించి.. 
ఎన్ని కష్టాలు వచ్చినా తమ బిడ్డలను బాగా చదివించుకోవాలని వాళ్ల జీవితాలను కొత్తగా నిర్మించాలన్న అమ్మలకు రాష్ట్రంలో కొదవేలేదు. ఆ తల్లుల ప్రేరణే ఈ ప్రభుత్వానికి బలం. తమ పిల్లలను చదువుల బాట పట్టించి వారి రాతను తిరిగా రాయాలనుకున్న తల్లికి ఈ ప్రభుత్వం నిండు హృదయంతో నమస్కరిస్తున్నది. వారి సంకల్పబలానికి అవసరమైన వనరులు, తోడ్పాటు అందించటం మా బాధ్యత అని చాటుచున్నది.

ఈ స్కీం ఉన్నదే తల్లులకు అని బుగ్గన స్పష్టం చేశారు. భారతదేశంలో ఇటువంటి పథకాన్ని తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రం మనదని బుగ్గన తెలిపారు. పిల్లల్ని చదివించుకోవటానికి తల్లికి ప్రోత్సాహం ఇస్తున్నామని తెలిపారు. నాకు తెలిసి ప్రపంచంలో కూడా ఎక్కడైనా ఉన్నదో, లేదో విచారించాల్సిన స్కీమని" బుగ్గన తెలిపారు. ముఖ్యమంత్రి వద్దు అన్నాఈ స్కీంకు జగనన్న అమ్మఒడి అని పేరు పెట్టడం జరిగిందన్నారు. 
 
జీఎస్డీపీపై చేపల కథలు
"జీఎస్డీపీ పెరిగిందని అంటున్నారు. మూడు సంవత్సరాల నుంచి కరువు ఉంటే ఎలా పెరిగిందంటే.. చేపల కథలు చెబుతున్నారు. మేము మొదట నుంచి ఏం చెబుతున్నామంటే ఈ చేపల కథలో డౌటుంది.  ఓసారి చెక్ చేద్దామని చేపలు అంత కరెక్ట్ గా కనబడటం లేదని చెబుతున్నాము. అయినా మేము జీఎస్డీపీ గురించి కాదు. పోయేటప్పుడు రెండు లక్ష యాభై వేల కోట్లు అప్పులు చేశారు.

లక్ష కోట్ల రూపాయిలు ఇవ్వాల్సినవి పెట్టి పోయారు. రాష్ట్రం దీనావస్థలో ఉందని చెప్పాము. జీఎస్డీపీ ఫిగర్స్ లో  ఏముంది అంటే..  హార్టికల్చర్, లైవ్ స్టాక్, ఫిషరీస్ ఈ మూడు సెగ్మెంట్స్ కూడా పండ్లు, చేపలు.. లెక్క చేసే విధానం లేదు. దీనిని మేం మొదటి నుంచి ప్రశ్నిస్తున్నామని" బుగ్గన తెలిపారు. 
 
మత్స్యకారులకు రూ10వేలు ఇస్తే లక్ష ఇవ్వొచ్చని టీడీపీ వారు అన్నారు. మరి, టీడీపీ వారు ఇస్తే ఎవరైనా ఆపారా? ఎవ్వరూ ఆపలేదు కదా? ధారాళ హృదయం అనేది ఎప్పుడూ ఉండాలి. వాళ్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా బంకపీసుకుంటారు. బయటకు వచ్చాక వేరేవాళ్లకు ధారాళంగా ఉండాలంటారు. సలహా అంటే.. మనం కూడా పార్టిసిపేట్ చేసేవిధంగా ఉండాలి.. ఉచిత సలహా అంటే మన పెట్టుబడి ఉండదు, సేల్స్ ట్యాక్స్ ఉండదు. ఇలాంటివి టీడీపీ ఇచ్చేవి. 
 
హౌసింగ్.. 
బడ్జెట్ లో హౌసింగ్ కేటాయింపులపై టీడీపీ నేతలు ప్రశ్నించటంపై స్పందిస్తూ.. గతంలో వాళ్లు చేసిన ఖర్చు రూ.3,189 కోట్లు. మేము రూ.3,617 కోట్లు బడ్జెట్ లో పెట్టాం. అంటే రూ. 500 కోట్లు అదనంగా బడ్జెట్ లో పెట్టాం.  పేదలకు ఇళ్ళ పట్టాలిచ్చేందుకు  భూసేకరణ చేసేందుకు రూ.5,000 కోట్లు పెడితే అది చాలదని అంటున్నారు. పట్టాలు ఇవ్వాలంటే ప్రతి ఎకరా ప్రతి సెంటూ కొనాల్సిన అవసరం లేదు. ముందు మన దగ్గర రిసోర్స్ వాడుకొన్న తర్వాత ల్యాండ్ కొనుగోలు అవసరమైనప్పుడు మాత్రమే కొనుగోలుకు పోతాము అని బుగ్గన తెలిపారు. 
 
అర్బన్ హౌసింగ్ టిడ్కోకు ఇచ్చారు. 
అన్నీ కలుపుకుంటే  చ. అ. కు రూ.2200కు ఇచ్చారు. మేము రూ.1200-1300 రేంజ్ లో ఇవ్వాలని అనుకుంటున్నాము. మనం ఉన్న అసెంబ్లీ అడుగు రూ.11,000లు. 200 చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరంలోనే భూమి విలువతో కలుపుకున్నా రూ.5,000 వస్తోంది. నల్ల రేగడి భూమిలోనే కట్టడానికే రూ.11,000. చూడండి ఎంత అవినీతి ఉందో ఇందులో. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరుగుతుంది. జరుగుతున్న పథకాలు మీరు కంటిన్యూ చేయటం లేదని నిరుద్యోగభృతి ఇవ్వలేదని టీడీపీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.  
 
బాబు వస్తే జాబు వస్తుందని 2014లో అన్నారు. మా స్కీం మీరు కంటిన్యూ చేయలేదు. 2014-15లో నిరుద్యోగ భృతిలో కేటాయింపులు, ఖర్చు సున్నా, 2015-16లో సున్నా. 2016-17లో సున్నా. మూడు సంవత్సరాలు సున్నా కేటాయింపులు. 2017-18లో కేటాయింపులు రూ.500 కోట్లు. ఖర్చు సున్నా. 2018-19లో 1,000 కోట్లు కేటాయించి రూ.273 కోట్లు ఖర్చు చేశారు.

టీడీపీ ఫ్లాగ్ షిప్ పోగ్రాంకు రూ.273 కోట్లు ఖర్చు చేసి మాట్లాడితే వాళ్లు చేయని పనులు అన్నీ మా నోటితో చెప్పిస్తారు. మా నోటితో చెప్పిస్తే ఎవరికి నష్టం. వాళ్ల లీడర్ కే కదా. నాకు లోపల ఓ డౌటుందని ఇది ఒకసారి కాదు. రోజులో ఒకసారి ఎవరో ఒకరు లేచి అడుగుతారు. అడిగితే మేం నిజాలు చెబుతాం. ఇది వారు చేసే కార్యక్రమం. 
 
దశలవారీగా మద్య నిషేధం..
మద్యపాన నిషేధం విడతల వారీగా తగ్గించాలనే ఈ రోజు ప్రైవేటు దుకాణాలు బంద్ చేసి ప్రభుత్వ దుకాణాలు ఏర్పాటు చేస్తున్నాం. రేటు పెరుగుతుంది. మందు రేటు ఎక్కువ చేస్తే తాగే వారి సంఖ్య తగ్గుతుంది. ఇల్లీగల్ జరగకుండా ప్రభుత్వ దుకాణాలు ఏర్పాటుకు లాజిక్ ఇదని తెలిపారు. అవి చూసుకోవాలి కదా.  టీడీపీ వారు కూడా బెల్ట్ షాపులు తీసేస్తాం అన్నారు. గ్రీన్ కలర్, బ్లూకలర్ ఎందుకు పెట్టారని అడిగారు. గతంలో మైక్ లుకు వాడే స్పాంజ్ కూడా పసుపు రంగులో ఉన్నాయి. పసుపు పచ్చ టవళ్లు. నల్ల స్పాంజులు చూశాం కానీ, మైక్ లు చూస్తే.. వాళ్లు రంగు గురించి మాట్లాడుతున్నారు. 
 
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలనే కదా తెలంగాణతో చర్చలు జరపుతున్నది. వాళ్లు చర్చలు జరపకుండా ఐదేళ్లు కాలయాపన చేసి కొట్లాడి, అనవసరంగా ప్రక్క రాష్ట్ర వ్యవహారంలో జోక్యం చేసుకొని అనవసరంగా పరిగెత్తుకొని వచ్చి ఈ రోజు మేము చర్చలు జరుపుతుంటే అదీ కూడా తప్పు గిప్పు అంటున్నారు. 
 
పింఛన్లుపై..
రూ.2,250 పింఛన్లు ఇస్తున్నాము. క్రమక్రమంగా రూ.3,000లకు పెరగబోతుంటే వాళ్లు బాధపడుతున్నారు. 2,000 నుంచి 2,250కు కాదు. రూ.1,000 నుంచి రూ.2,250కి పెరిగింది. ఇచ్ఛాపురంలో జగన్ పింఛన్లు పెంపుపై ప్రకటన చేశాక పాలాభిషేకాలు, పసుపాభిషేకాలు చేశారు. ప్రతి అవ్వతో, తాతతో ప్రమాణం చేయించుకున్నారు. మాకు ఓటేస్తే పింఛన్లు ఇస్తామని చెప్పారు. వాళ్ల ఆత్మాభిమానం దెబ్బతినేటట్లు చేశారు.

వాళ్లు ఐదేళ్లలో సగటున రూ.5,507 కోట్లు ఖర్చు చేశారు. ఈ రోజు మనం  ఏడాదికి 15,600 కోట్లు ఖర్చు చేస్తున్నాము. మూడింతలు ఖర్చు చేస్తున్నాము. చంద్రబాబు హయాంలో పింఛన్లు కూడా జన్మభూమి కమిటీలు మంజూరు చేస్తేనే వచ్చిన పరిస్థితి. ఇప్పుడు అర్హులైన  ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తామని బుగ్గన అన్నారు. 
 
మిషన్ మోడ్.. ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు.. 23 సీట్లు. 
మూడు పువ్వులు ఆరు కాయల్లా.. చంద్రబాబు హయాంలో 7 మిషన్లు, 5 గ్రిడ్లు పెడితే వారికి 23 సీట్లు వచ్చాయి. నడుస్తున్న స్కీంలు ఎందుకు ఇవ్వటం లేదని అంటున్నారు. రైతు రుణమాఫీని కమిటీలు వేసి  24వేల కోట్లకు తగ్గించారు. వాళ్లు కట్టాల్సింది 87వేల కోట్లు. చివరకు 16,500 కోట్లు బడ్జట్ లో కేటాయించి ఖర్చు 15,279 కోట్లు మాత్రమే చేశారు. అంతేకాకుండా రైతులకు సున్నా వడ్డీ ఎగరకొట్టారు. చివరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా పెట్టలేదు. 
 
అన్నదాత సుఖీభవ.. 
ఎన్నికలకు నెల రోజుల ముందర పెట్టారు. సివిల్ సప్లై కార్పొరేషన్, రాజధాని ఇలా ఎక్కడ పడితే అక్కడ నుంచి డబ్బులు లాగేశారు. అన్నదాత సుఖీభవ రూ.1000 ఇచ్చి వాటి మీద ప్రమాణం చేయించుకున్నారు. ఎన్ఆర్జీఈఎస్ బిల్లులు కూడా నీరు-చెట్టు పథకం కింద బిల్లులు చేసుకున్నారని వివరించారు. 
 
గ్రామ సచివాలయాలు పెట్టి ప్రజల సర్వీసులు అన్నీ కన్సాలిడేట్ చేయాలని జరుగుతోంది. చరిత్రలో మొట్టమొదటిసారిగా సచివాలయాల ద్వారా 1,36,000 ఉద్యోగాలు ఇస్తున్నామని అన్నారు. (3లక్షల వాలంటీర్లు కాకుండా) ప్రజలకు రావాల్సిన రాకుండా కొంతమందిని ఇంట్లో కూర్చొబెట్టి జీతాలు ఇచ్చారు. కన్సాలిడేషన్ చేసి ప్రజలకు అవసరమైనవి ఇస్తున్నామని అన్నారు. 
 
ఏసీడీపీ గ్రాంట్.. ఇవ్వం అన్నారు... 
గతంలో వైయస్ఆర్సీపీకి చెందిన 63 మంది ఎమ్మెల్యేలం వెళ్లి కనీసం ఏసీడీపీ గ్రాంట్ ఇవ్వమని చంద్రబాబును కోరాము. ఎమ్మెల్యేల గ్రాంట్ కూడా ఇవ్వం పొమ్మన్నారు.  కానీ, ఇప్పుడు మా నాయకుడు వాళ్లు,  మనమూ ఎవరైనా సరే.. నిధులు ఇస్తామని రాష్ట్రంలో తాగునీటి సమస్య ఉందని ప్రతిపక్ష చంద్రబాబుతో సహా ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి నుంచి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి కోటి రూపాయలు వాడుకోవచ్చని జగన్ అన్నారని బుగ్గన తెలిపారు.