గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 13 ఆగస్టు 2018 (11:27 IST)

అనుమానం పెనుభాతమైంది.. కత్తిపీటతో భార్య పీక కోసిన భర్త.. ఎక్కడ?

అనుమానం పెనుభూతమైంది. తనను కాదని పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని భావించిన ఓ కిరాతక భర్త.. కట్టుకున్న భార్యను విచక్షణారహితంగా హత్య చేశాడు. ఈ దారుణం నిడమర్రు మండలంలో జరిగింది. కత్తిపీటతో పీ

అనుమానం పెనుభూతమైంది. తనను కాదని పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని భావించిన ఓ కిరాతక భర్త.. కట్టుకున్న భార్యను విచక్షణారహితంగా హత్య చేశాడు. ఈ దారుణం నిడమర్రు మండలంలో జరిగింది. కత్తిపీటతో పీక కోశాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ద్వారకా తిరుమల మండలం పి.కన్నాపురం గ్రామానికి చెందిన గుడిసే పాపయ్య, నాగమణి (30) దంపతులు కుమార్తె రమ్యతో కలిసి ఇటీవల గుణపర్రులో కోటగిరి సత్యనారాయణ రొయ్యల చెరువు వద్దకు కాపలాదారు కుటుంబంగా వచ్చారు. వీరి కుటుంబం చెరువు వద్ద షెడ్డులో ఉంటున్నారు. 
 
బుధవారం రాత్రి భార్యాభర్తలిద్దరూ ఘర్షణ పడ్డారు. పాపయ్య విచక్షణ మరిచి నాగమణిని కత్తిపీటతో నరికేశాడు. అనంతరం ఇంటికి తాళం వేసి కుమార్తె రమ్యను ఆదే గ్రామంలోని బంధువుల ఇంటి వద్ద విడిచి పరారయ్యాడు. 
 
అయితే, రొయ్యల చెరువు వద్ద పని చేసే సిబ్బంది ఈ విషయాన్ని గమనించి షెడ్డు వద్దకు వచ్చి తాళాలు పగులకొట్టారు. నాగమణి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించి స్థానికులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత నిడమర్రు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.