అంతకు మించిన మరణం మరొకటి లేదు. కానీ ఎందుకొస్తుందో ఎవరికీ తెలీదు.. ఎందుకూ..?
సుఖమరణం..ఒకరిని ఇబ్బంది పెట్టకుండా, సంవత్సరాలపాటు మంచాన బడి నరకం అనుభవించకుండా, ఇంకా చావలేదే అంటూ ఇంటిల్లిపాదీ చెడతిట్టుకోకుండా పడుకున్నవారు పడుకున్నట్లే జీవితం చాలిస్తే ఎంత బాగుంటుంది. వృద్ధాప్యంలో ఆలనా పాలనా చూసేవారు లేక, పట్టెడన్నం ప్రేమగా పెట్టే
సుఖమరణం..ఒకరిని ఇబ్బంది పెట్టకుండా, సంవత్సరాలపాటు మంచాన బడి నరకం అనుభవించకుండా, ఇంకా చావలేదే అంటూ ఇంటిల్లిపాదీ చెడతిట్టుకోకుండా పడుకున్నవారు పడుకున్నట్లే జీవితం చాలిస్తే ఎంత బాగుంటుంది. వృద్ధాప్యంలో ఆలనా పాలనా చూసేవారు లేక, పట్టెడన్నం ప్రేమగా పెట్టే దిక్కులేక ఈ కట్టెను ఎప్పుడు తీసుకెళతావు దేవుడా అంటూ వేడుకుంటుండే కోట్లాది మంది కోరుకుంటున్న చివరి కోరికే సుఖమరణం. ఇప్పుడని కాదు.. మానవ జాతి బాల్య దశ నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయే సుఖమరణం గురించి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చనిపోయే స్వచ్చందమరణం గురించి కలలు కంటూనే ఉన్నారు.
మహాభారతంలో కూడా కురుక్షేత్రంలో నేల కూలిన భీష్మాచార్యుడు పుణ్యకాలంలోనే చనిపోతానని చెప్పి తన మరణాన్ని ఉత్తరాయణం వచ్చేవరకు యుద్ధభూమిలోనే అంపశయ్యపై శయనించడం గురించి మనందరికీ తెలుసు. కానీ ఇలా కోరుకున్నవారందరికీ సునాయాస మరణం రాకున్నప్పటికీ అతికొద్ది మంది ఏ ఆరోగ్య సమస్యలు లేకున్నా రాత్రికి రాత్రే నిద్రలోనే మరణిస్తుంటారు. అంతవరకు వారికి ఏ సమస్యలూ ఉండవు. అనారోగ్యాలు ఉండవు. కానీ పడుకున్న వారు పడుకున్నట్లే నిద్రలోనే జీవితం చాలించి వెళ్లిపోతుంటారు
అనారోగ్య సమస్యలు ఏవీ లేకున్నా రాత్రికి రాత్రే నిద్రలోనే మరణించే వారి గురించి సుఖమైన చావు అనే పదాన్ని వాడుతుంటారు. బీపీ, షుగర్, స్థూలకాయం, కేన్సర్ వంటి రోగాలు ఏవీ లేకున్నా, పూర్తి ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి ఇలా అకాల మరణం చెందేందుకు కారణమేంటో డాక్టర్లు కూడా చెప్పలేరు. అయితే ఇలా నిద్రలోనే మరణిస్తున్న వారు ఎక్కువగా పురుషులే అని ఓ పరిశీలనలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా అందులోనూ ఆసియన్ దేశాల్లోని పురుషులే ఇలా ఆకస్మిక మరణాలకు గురవుతున్నారట. రోజూలాగే అన్నం తింటారు.. టీవీ చూస్తారు.. కుటుంబ సభ్యులతో కులాసాగా గడుపుతారు... నిద్రకు ఉపక్రమిస్తారు. కానీ వారికి అదే చివరి రాత్రి అని వారితో సహా ఎవరికీ తెలియకపోవడమే విచిత్రం.
లోస్ అనే ఆఫ్రికా దేశంలో అయితే ఆడ దయ్యాలు పురుషులను ఇలా అకాల మరణాలకు గురిచేస్తున్నాయని నమ్ముతుంటారు కూడా. మన పురాణాల ప్రకారం నిద్రలో ఉన్నవారిని ఉన్నట్లే తీసుకుపోవడానికి యమభటులు నరకం నుంచి వచ్చి యమపాశం విసిరి నిద్రలోనే మనల్ని లేపుకుపోతారని ప్రతీతి కదా. కానీ మనిషి ఎందుకు ఉన్నట్లుండి నిద్రలోనే మరణిస్తాడు అనే సమాధానం తెలియని అనాది ప్రశ్నకు పూర్వీకులు యమభటులను కారణంగా చెబితే ఆధునిక వైద్యశాస్త్రం భౌతిక కారణం చెబుతోంది.
అదేమిటంటే... సాధారణంగా మనిషి గుండెకు విశ్రాంతి లేదు. 24 గంటలూ పనిచేస్తూనే ఉంటుంది. అయితే నిద్రలో ఉండగా అకాల మరణం చెందిన వారి గుండె ఒక్కసారిగా పనిచేయడం మానేస్తుందనీ, తద్వారా నిద్రలోని వ్యక్తి ఎలాంటి ఒత్తిడికి లోనవకుండానే మరణిస్తాడని డాక్టర్లు చెబుతున్నారు.