సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 18 జనవరి 2019 (11:30 IST)

సమంత - రకులు ఎవరు... నాకు తెలియదు : కేఏ పాల్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మతప్రబోధకుడు డాక్టర్ కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, టాలీవుడ్ హీరోయిన్లు సమంత, రకుల్ ప్రీత్ సింగ్‌లు తనకు ఎవరో తెలియదన్నారు. కానీ, ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున ప్రతి ఒక్కరి ఓటు తనకు అవసరమన్నారు. 
 
అందువల్ల సమంత ఎవరన్న అంశంపై ఆరా తీయగా ఆమె హీరో అక్కినేని నాగార్జున కోడలని తెలిసిందన్నారు. ఇకపోతే, రకుల్ ప్రీత్ సింగ్ నిజంగానే తనకు ఎవరో తెలియదన్నారు. 
 
నిజానికి గతంలో టీడీపీ నేత, హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా తనకు ఎవరో తెలియదని చెప్పిన పాల్.. ప్రతి ఒక్కరినీ విస్మయానికి లోనుచేశారు. ఇపుడు సమంత తనకు ఎవరో తెలియదని చెప్పి ప్రతిఒక్కరినీ ఆశ్చర్యపరిచారు.