ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 28 సెప్టెంబరు 2024 (22:38 IST)

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

Chandrababu Naidu
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు తనను డిక్లరేషన్ ఎందుకు అడుగుతున్నారని మాజీ సీఎం జగన్ లేవనెత్తిన ప్రశ్నకు సీఎం చంద్రబాబు స్పందించారు. ''ఆయన తన ఇంట్లో బైబిల్ చదువుతారట, మీరు క్రిస్టియన్ మతస్తులైనప్పుడు మీరు ఎందుకు అలా ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం... నేరుగా చర్చికి వెళ్లి చదవండి. అందులో తప్పేముంది.
 
నేను హిందువును. అన్ని గుడులకు వెళ్తాను. పూజలు చేస్తాను. అదేసమయంలో చర్చికి వెళ్లి ప్రార్థన చేస్తాను. వారి మతాన్ని గౌరవిస్తా. అలాగే మసీదుకు వెళ్లి ముస్లిం సోదరులతో కలిసి నమాజులో పాల్గొంటా. వారి మత సంప్రదాయాలను ఆచరిస్తా. ఇందులో తప్పేముంది, కనుక ఇతర మతాలకు సంబంధించిన సంప్రదాయాలను గౌరవించడం తప్పా అని జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.