బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (08:15 IST)

వైన్‌షాపుల్లో ఫోన్‌ పే, గూగుల్ పే ఎందుకు లేవు?: పట్టాభి రాం

"వైన్‌షాపుల్లో ఫోన్‌ పే, గూగుల్ పే ఎందుకు లేవు.. కేవలం క్యాష్ మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారు.. హెరాయిన్ విషయంలో దర్యాప్తు లేకుండానే క్లీన్‌చిట్ ఎందుకు ఇచ్చారు.. మత్తు పదార్థాలను ఎక్కడి నుంచి కొంటున్నారు.. నల్లధనం మొత్తం ఎక్కడకి పోతోంది..? విజయవాడ నడిబొడ్డులో దుకాణాన్ని తెరిచి.. టన్నుల టన్నుల హెరాయిన్‌ను ఎక్కడికి పంపిస్తున్నారు..?" అంటూ సీఎం జగన్‌పై టీడీపీ నేత పట్టాభి రాం ప్రశ్నల వర్షం కురిపించారు.

జగన్‌లో నిజాయితీ ఉంటే వైన్ షాపుల్లో ఫోన్‌పే, గూగుల్ పే వంటి డిజిటల్ ట్రాన్సక్షన్స్ పెట్టాలని డిమాండ్ చేశారు. దేశంలోనే సీఎం జగన్.. అతిపెద్ద లిక్కర్ డాన్.. అంటూ ధ్వజమెత్తారు. 
 
వైసీపీ నేతలకు దమ్ముంటే రేపటి నుంచే అన్ని రంగాల్లో డిజిటల్ ట్రాన్సక్షన్స్ అందుబాటులోకి తేవాలని సవాల్ విసిరారు. లిక్కర్ మాల్స్‌ని ప్రైవేట్ చేతికి అప్పగిస్తూ కోట్లు దండుకుంటున్నారని మండిపడ్డారు.

ఆన్‌లైన్ ట్రాన్సక్షన్ పెడితే తమ బండారం బయటపడుతుందని.. ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటున్నారని విమర్శించారు. రూ.25 వేల కోట్ల అప్పు తెచ్చేందుకు ఎక్సైజ్ ఆదాయాన్ని తాకట్టు పెట్టారన్నారు. మద్య నియంత్రణ అంటే ఇదేనా అంటూ ఫైర్ అయ్యారు.
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ని డ్రగ్గాంధ్రప్రదేశ్‌గా మార్చారని దుయ్యబట్టారు. మాదకద్రవ్యాలకు రాష్ట్రాన్ని చిరునామాగా మార్చారని చెప్పారు. విజయవాడ నడిబొడ్డులో దుకాణాన్ని తెరిచి.. టన్నుల టన్నుల హెరాయిన్‌ను రాష్ట్రాలకు, దేశాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. దీనికి తోలుబొమ్మ లాంటి డీజీపీని అడ్డుపెట్టుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏం జరగలేదంటూ స్టేట్‌మెంట్‌లు ఇస్తున్నారని చెప్పారు.
 
నీ కుట్రంతా రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతానని తెలిపారు. ఏరకంగా వైన్‌షాపుల్లో ఓన్లీ క్యాష్ ట్రాన్సక్షన్స్ చేసి నల్ల డబ్బు సంపాదిస్తున్నావో, ఏ రకంగా తాలిబన్లకు చెల్లింపులు చేస్తున్నావో, ఏరకంగా పోర్టులన్నింటినీ హస్తగతం చేసుకుని.. మాదక ద్రవ్యాల ద్వరా వేల కోట్లు ఎలా సంపాదిస్తున్నావో.. మొత్తం బయటపెడతామని పేర్కొన్నారు. వైసీపీ వారికి ధమ్ము, ధైర్యం ఉంటే తాను లేవనెత్తిన ప్రశ్నలకు... రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని పట్టాభి రాం డిమాండ్ చేశారు.