మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 ఏప్రియల్ 2021 (15:30 IST)

కుటుంబ కలహాలు.. భర్తపై యాసిడ్ పోసిన భార్య.. ఎక్కడంటే..?

క్షణికావేశాల కారణంగా నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. తాజాగా భార్యాభర్తల కలహాలు యాసిడ్ దాడికి దారితీశాయి. తిరుపత్తూరులో కుటుంబ కలహాలతో ఏర్పడిన ఘర్షణలో భర్తపై భార్య యాసిడ్‌ దాడి చేసింది. 
 
తిరుపత్తూరు కోటవీధి చంద్‌ మియన్‌ వీధికి చెందిన నశ్రీన్‌ తాజ్‌ (25) అనే యువతికి బెంగుళూరు జేబీనగర్‌ ప్రాంతానికి చెందిన అప్సల్‌ సయ్యద్‌ (27)తో ఆరు నెలల ముందు వివాహమైంది. వివాహమైన కొన్నాళ్లకే వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. విరక్తి చెందిన నశ్రీన్‌ తాజ్‌ భర్త నుంచి విడిపోయి పుట్టింటిలో ఉంటోంది.
 
ఈ క్రమంలో గత 10వ తేదీ తిరుపత్తూరుకు వచ్చిన అప్సల్‌ సయ్యద్‌  పిన్ని కుమార్తె ఉవేశ్‌తో కలిసి నశ్రీన్‌ తాజ్‌ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. దీంతో ఆగ్రహం చెందిన నశ్రీన్‌తాజ్‌ అక్కడ వున్న టాయిలెట్‌కు ఉపయోగించే యాసిడ్‌ను భర్త, ఉవేశ్‌పైన పోశారు. 
 
దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు తిరుపత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్సల్‌ సయ్యద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపత్తూరు టౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ే