గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 ఏప్రియల్ 2021 (14:16 IST)

ఉద్యోగం ఊడింది.. సెక్స్ వర్కర్‌గా మారిన భర్త.. భార్య ఏం చేసిందంటే..?

కోవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. చిన్న చిన్న వ్యాపారులు ఉపాధి కోల్పోయారు. ఏ రంగంలోనైనా ప్రస్తుతం ఇదే పరిస్థితి. ఇలా కరోనా మహమ్మారితో బీపీఓ జాబ్‌ పోవడంతో సెక్స్‌వర్కర్‌గా మారిన యువకుడి (27) ఉదంతం బెంగళూర్‌లో వెలుగుచూసింది. 
 
కమర్షియల్‌ సెక్స్‌ వర్కర్‌గా మారి గంటకు రూ.3000 నుంచి రూ.5000 వరకూ సంపాదిస్తున్న ఇతడికి ఇప్పుడు కొత్త చిక్కు వచ్చింది. చాటుమాటుగా సాగిస్తున్న వ్యవహారం కాస్తా భార్యకు తెలియడంతో ఆమె విడాకులకు సిద్ధమైంది. భర్త నిత్యం మొబైల్‌ ఫోన్‌, ల్యాప్‌టాప్‌తో గడుపుతుండటంతో అనుమానం వచ్చిన భార్య నిఘా పెట్టింది. ల్యాప్‌టాప్‌ యాక్సెస్‌ కోసం ఇంజనీర్‌ అయిన తన సోదరుడి సాయం కోరింది.
 
ల్యాప్‌టాప్‌ తెరిచిచూడగా భర్త నగ్న చిత్రాలు, పలువురు మహిళల అర్థనగ్న చిత్రాలు చూసి షాక్‌ అయింది. భర్త రహస్యంగా సెక్స్‌ వర్కర్‌గా పనిచేస్తున్నాడని తెలుసుకుంది. అయితే తొలుత అవి గ్రాఫిక్‌ ఫోటోలని భర్త బుకాయించగా ఆమె మల్లేశ్వరం పోలీస్‌ స్టేషన్‌లోని మహిళా హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించడంతో అతడి నిర్వాకం బట్టబయలైంది. 2017లో తాము పనిచేసే బీపీఓ కార్యాలయంలో వీరి పరిచయం రెండేళ్ల పాటు డేటింగ్‌కు దారితీసింది. ఆపై 2019లో వీరి వివాహం జరిగింది.
 
ఇక పోలీసుల దర్యాప్తులో తాను ఉద్యోగం కోల్పోవడంతో కమర్షియల్‌ సెక్స్‌ వర్కర్‌గా మారానని యువకుడు అంగీకరించాడు. తన తాజా వృత్తిలో పరిచయమైన యువతితో ప్రేమలో పడ్డానని చెప్పుకొచ్చాడు. దంపతుల మధ్య సఖ్యత కుదిర్చేందుకు తాము చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని కౌన్సిలర్‌ తెలిపారు.