గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 10 ఏప్రియల్ 2021 (18:40 IST)

వదినను లోబరుచుకుని ఆమెను రాష్ట్రం దాటించేసి...

వదిన అంటే తల్లితో సమానం. అలాంటి వదిన పైనే కన్నేశాడు కామాంధుడు. ఆమెను లొంగదీసుకుని ఇంటి నుంచి బయటకు తీసుకెళ్ళిపోయాడు. నాలుగునెలల పాటు ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా కుటుంబ సభ్యులకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. అయితే చివరకు వారి సమాచారం తెలిసిపోయి అడ్డంగా ఇరుక్కుపోయారు. 
 
పంజాబ్‌కి చెందిన బల్జీత్ కౌర్, రాజాసింగ్‌లు భార్యాభర్తలు. వీరికి 18 యేళ్ళ కుమారుడు ఉన్నాడు. అయితే రాజా సింగ్ తమ్ముడు సద్‌నామ్ సింగ్‌కి పెళ్ళి కాలేదు. వీరందరూ కలిసే ఉన్నారు. మొదట్లో వదిన పట్ల ఎంతో గౌరవంగా వున్న సద్‌నామ్ సింగ్ ఆ తరువాత ఆమెపై వ్యామోహాన్ని పెంచుకున్నాడు.
 
కరోనా సమయం నుంచి ఆమెకు చనువుగా వెళ్ళడం ప్రారంభించాడు. మాయమాటలు చెప్పాడు. నువ్వే సర్వస్వమంటూ లోబరుచుకున్నాడు. ఇంట్లోనే ఈ తతంగం మొత్తం ఎవరికీ అనుమానం రాకుండా సాగేది. కానీ విషయం ఎప్పటికైనా తెలిసిపోతుందని సద్‌నామ్ సింగ్ ఆమెను బయటి ప్రాంతానికి తీసుకెళ్ళిపోవాలనుకున్నాడు.
 
నాలుగు నెలల క్రితం గుజరాత్ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చేశాడు. దీంతో రాజా సింగ్ కుమిలిపోయాడు. అంతేకాదు రాజా సింగ్ కుమారుడు నిషాంత్ సింగ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. వారం రోజుల క్రితం వారు హైదరాబాద్‌లో ఉన్నారన్న విషయం తెలుసుకున్నాడు. 
 
భర్త పట్టించుకోలేదు గానీ కొడుకు మాత్రం ఎలాగైనా అతడిని చంపేయాలనుకున్నాడు. తన స్నేహితులు ముగ్గురిని వెంట పెట్టుకుని హైదరాబాద్ వెళ్ళాడు. రెండు రోజుల పాటు వారిద్దరు ఎక్కడికి వెళుతున్నారో రెక్కీ చేశాడు. 
 
తన తల్లి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగానే స్నేహితులతో కలిసి ఇంట్లోకి వెళ్ళి సద్‌నామ్ సింగ్‌ను చంపేశాడు. ఆ తరువాత తల్లి రాగానే... నాన్న దగ్గరికి వెళ్ళు అంటూ గట్టిగా అరిచాడు. అప్పటికే పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.