శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (07:58 IST)

విశాఖ నుంచి పోటీ తథ్యం.. అది స్వతంత్ర అభ్యర్థిగానైనా.. : లక్ష్మీనారాయణ

laxminarayana
వచ్చే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడం తథ్యమని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. అయితే, ఒక పార్టీ నుంచి పోటీ చేయకపోయినప్పటికీ స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని స్పష్టంచేశారు. 
 
నిజానికి గత ఎన్నికల్లో ఆయన విశాఖ నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ఆయన ఆ పార్టీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ప్రజలకు దగ్గరగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. పోటీ తథ్యమని స్పష్టం చేశారు. అయితే, ఏ ఒక్క పార్టీ తరపున పోటీ చేయకపోయినప్పటికీ స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. 
 
కానిస్టేబుల్, ఎస్సై పోస్టుల భర్తీకి జేడీ ఫౌండేషన్, ఐఏసీఈ సంయుక్త ఆధ్వర్వంలో ఇచ్చిన ఉచిత శిక్షణలో మంచి ఫలితాలు సాధించినట్టు చెప్పారు. మొత్తం వెయ్యిమందికి శిక్షణ ఇస్తే ప్రాథమిక పరీక్షలకు 98.2 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు.