గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (20:29 IST)

రేపు సాయంత్రం 4 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు రిలీజ్

tirumala
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆర్జిత సేవా టిక్కెట్లను బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తితిదే బోర్డు అధికారులు వెల్లడించారు. ఈ టిక్కెట్లు మార్చి, ఏప్రిల్, మే నెలకు సంబంధించిన కోటాకు చెందిన టిక్కెట్లను విడుదల చేస్తున్నారు. 
 
రేపు ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 24వ తేదీ ఉదయం 10 వరకు ఆన్‌లైన్ లక్కీడిప్ నిర్వహించనున్నారు. లక్కీ‌డిప్‌లో టిక్కెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన రుసును చెల్లించి టిక్కెట్లుఖరారు చేసుకోవాలని తితిదే సూచించింది. కాగా, తితిదే ఆర్జిత సేవల్లో ఊంజల్ సేవ, కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఉన్నాయి.