ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 డిశెంబరు 2024 (16:18 IST)

విజయసాయి రెడ్డీ... నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు : మంత్రి అనిత వార్నింగ్ (Video)

Anitha
వైకాపా సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి ఏపీ హోం మంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. టాపిక్ డైవర్ట్ చేసేందుకు నోటికొచ్చినట్టుగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. ఒక వ్యక్తి గురించి మాట్లాడేముందు ఆ వ్యక్తి స్థాయి, వయసు, మన స్థాయి, మన వయసు మరిచిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ పద్దతిగా మాట్లాడాలని ఆమె హెచ్చరించారు. 
 
ఆమె సోమవారం మాట్లాడుతూ, స్థాయి, వయసు మరిచిపోయి చిల్లరగా మాట్లాడుతున్నారని, ఇది ఏమాత్రం మంచి పద్దతి కాదన్నారు. చంద్రబాబును విమర్శించినా, తమకు పవన్ కళ్యాణ్‌కు మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించినా విజయసాయిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పద్దతిగా మాట్లాడాలన హితవు పలికారు. 
 
తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసుకోవాలని విజయసాయి రెడ్డి ధైర్యంగా చెప్పాలని అన్నారు. ఆయనపై ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామన్నారు. రేషన్ బియ్యం అక్రమాలపై కూడా విచారణ జరుగుతుందన్నారు. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. వైకాపా నేతల ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ఇపుడొచ్చిన 11 సీట్లు కూడా రావని ఆమె జోస్యం చెప్పారు. విజయవాడ సబ్‌ జైలులో మౌలిక సదుపాయాల మెరుగు కోసం కృషి చేస్తామని తెలిపారు.