హోంమంత్రి సుచరిత పదవి పోతుందా?
రాష్ట్ర హోంమంత్రి చిక్కుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. షెడ్యూలు కులాలకు సంబంధించిన హోదాను ఆమె పూర్తిగా దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై విచారణ జరపాలని జాతీయ ఎస్సి కమిషన్ అధికారులను ఆదేశించింది.
అంతేకాదు వారంరోజుల్లోనే నివేదిక ఇవ్వాలని కూడా జాతీయ కమిషన్ ఆదేశాలిచ్చింది. విచారణలో హోంమంత్రి మేకపాటి సుచరితకు వ్యతిరేకంగానే నిర్ణయం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అయితే హోంమంత్రిపైనే విచారణ జరుగుతుండటం మాత్రం వైసిపి వర్గాల్లోను, అలాగే ఆమె అనుచరుల్లోను ఆందోళన నెలకొంది. ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో ఒక మతాన్ని గురించి ఆమె మాట్లాడడం.. ఆ మతంలోనే ఉన్నానని చెప్పడంతో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జాతీయ ఎస్సి కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.
దీంతో చిక్కుల్లో పడింది సుచరిత. ఒకవేళ వ్యతిరేకంగా నిర్ణయం వెలువడితే మాత్రం ఖచ్చితంగా హోంమంత్రి పదవి పోవడం ఖాయమన్న ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. ఇప్పటికే సిఎం పాత మంత్రులను తొలగించి కొత్త వారిని తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్న నేపథ్యంలో హోంమంత్రి పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఆశక్తికరంగా మారుతోంది.