1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: ఆదివారం, 1 మే 2016 (18:11 IST)

దాహం వేస్తోంది... మంచినీళ్ళు కావాలంటూ... చోరీలు చేసే చిన్న‌ది!

దాహం వేస్తోంది... కాస్త మంచినీళ్ళు ఇస్తారా అంటూ, ఇంటిలోకి వ‌స్తుంది. ఆ స‌మ‌యంలో చిన్న‌వాళ్ళు, ముస‌లి వాళ్లు మాత్ర‌మే ఇంట్లో ఉంటే... ఇక అక్క‌డ చోరీ జ‌రిగిన‌ట్లే. ఈ చిన్న‌ది బంగారం, సొమ్ము దోచుకున్న‌ట్లే. కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్యపేట మండ‌లం బూద‌వాడ‌కు చెందిన మూదావ‌త్ రాణికి 20 ఏళ్ళు. ఇంట‌ర్ చ‌దివింది. అదే గ్రామ‌నికి చెందిన వ్య‌క్తిని ప్రేమ వివాహం కూడా చేసుకుంది. 
 
విజ‌య‌వాడ‌లోని నిడ‌మానూరులో నివాసం ఉంటోంది. నిత్యం సినిమాలు, షాపింగ్ పేరిట జ‌ల్సా చేయ‌డం అల‌వాటు. దీనికోసం డ‌బ్బు కావాలి. అందుకే ఇళ్ళ‌లోకి ప్ర‌వేశించి చిన్న‌పిల్లలు, వృద్ధుల‌ను చూసి మంచినీళ్ళు అడిగి, చోరీల‌కు పాల్ప‌డుతుంది. ఇటీవ‌ల ఈమె ప‌డ‌మ‌ట, పెన‌మ‌లూరులో చోరీల‌కు పాల్ప‌డ‌టంతో నిఘా వేసిన పోలీసులు రాణిని ప‌ట్టుకున్నారు. ఆమె నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు.