గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 1 మే 2022 (14:03 IST)

నవరత్నాలు కాదు.. నవ మాసాలు... 18 స్కాములు

yanamala
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరుపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి యలమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ ప్రవేశపెట్టింది నవరత్నాలు కాదనీ నవ మోసాలు, 18 స్కాములు అని ఆరోపించారు. 
 
ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్నది నవ రత్నాలు కాదనీ నవ మోసాలని ఆరోపించారు. జగన్ పాలన 9 మోసాలు, 18 స్కామ్‌లు, 36 దోపిడీలుగా సాగుతోందని ఆరోపించారు. 
 
మూడేళ్లలో రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టిన పాపం, ఘనత అన్నీ జగన్మోహన్ రెడ్డికే చెల్లుతాయన్నారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకం అవినీతిమయంగా మారిందని ఆయన ఆరోపించారు.