గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: బుధవారం, 21 అక్టోబరు 2020 (22:20 IST)

తమిళనాడు ముఖ్యమంత్రిని పరామర్శించిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తల్లి తవసాయమ్మ కొద్ది రోజులక్రితం అనారోగ్యంతో మరణించిన విషయం విదితమే. దీంతో వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్కే రోజా మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని పరామర్శించారు.
 
ఆర్కే రోజా తన భర్త ఆర్కే సెల్వమణితో కలిసి వెళ్లారు. సీఎం తల్లి చిత్ర పటం వద్ద అంజలి ఘటించిన రోజా అనంతరం సీఎంతో కాసేపు మాట్లాడారు. పలు పార్టీ నేతలు కూడా పళనిస్వామిని పరామర్శించారు. వీరిలో ముఖ్యంగా ఎండీఎంకే నేత వైగో, సీపీఐ నేత ముత్తరసన్, సినీ నటి బీజేపీ నేత ఖుష్బూ, డీఎండీకే నేత సుదీప్, సినీ నిర్మాత ఆర్బీ చౌదరి తదితరులు వున్నారు.